Gossipsవాటమ్మా వాట్ ఈజ్ దిసమ్మ

వాటమ్మా వాట్ ఈజ్ దిసమ్మ

బ్యాండ్ ఉంది బ్యాంగిల్ లేదు.. మ‌స్తు మ‌స్తు స్నేహం ఉన్న‌ది కానీ మ‌న‌సు పంచుకునే మ‌గువే లేదు.. పాపం హీరో రామ్ ఇలానే మ‌థ‌న ప‌డిపోతున్నాడు త‌న బ్రేక‌ప్ గురించి. వాట‌మ్మా వాట్ ఈజ్ దిస‌మ్మా అంటూ క్వ‌శ్చ‌న్ చేస్తున్నాడు. ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీతో మ‌న‌ముందుకు రానున్న ఈ సినిమాలో యంగ్ లిరిసిస్ట్ శ్రీ‌మ‌ణి రాసిన ఈ పాట ఇప్పుడు యూత్ స‌ర్కిల్స్‌లో తెగ హ‌ల్ చేస్తోంది.ఫుల్ జోష్ లో దేవీ శ్రీ పాడిన ఈ పాట వెరీ క్యాచీవే లో సాగుతూ.. విన్నాక మ‌రో మారు హ‌మ్ చేసుకునేలా ఉంది. గ‌తంలో నేనూ శైల‌జా లో క్రేజీ క్రేజీ ఫీలింగ్ పాట ఎంత‌గా ఊపేసిందో ఇప్పుడీ పాట కూడా అంతకుమించి  క్రేజ్ ని ద‌క్కించుకోవ‌డం ఖాయం. అల్ట్రామోడ్ర‌న్ ప‌దాలు వినిపిస్తూ శ్రీ‌మ‌ణి రాసిన ఈ పాట సినిమాకో హైలెట్‌గా నిల‌వ‌డం ఖాయం

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news