Gossipsరామ్ స్పీడ్ కి ఇద్దరు కావాలంట !

రామ్ స్పీడ్ కి ఇద్దరు కావాలంట !

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ స్టయిలే వేరు. ప్రతి సినిమాకి సినిమాకి డిఫరెంట్ యాంగిల్లో తన నటన వైవిధ్యాన్ని ప్రదర్శించడం అతని స్టయిల్. ఇతగాడు ఏ సినిమాలో నటించినా పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తాడు. అంతగా పాత్రలోకి లీనమైపోతాడు ఈ యంగ్ హీరో తాజాగా ‘ఉన్నది ఒకటే జిందగీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమా రామ్ సరసన ఇద్దరు హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు రామ్ జిందగీలో పోటీ పది మరి నటించారు. తాజాగా ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో రామ్ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కబోతోంది.రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కబోతోన్న ఈ సినిమాకి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ పక్కన నటించేందుకు ఇద్దరు హెరాయిన్ లు కావాలట. అయితే ఇప్పటికే ఓ హీరోయిన్ గా నివేదా థామస్ ని ఎంపిక చేసుకున్నారు. మరో హీరోయిన్ ని ఎంపిక కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ సినిమాతోనైనా భారీ హిట్ కొట్టాలని రామ్ చూస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news