ట్విట్టర్ సాక్షిగా.. నాగబాబుని దారుణంగా ఏకేసిన వర్మ

ram gopal varma counter attack on nagababu khaidi no 150 pre release event

Ram Gopal Varma attack on Nagababu for making controversial comments on him in khaidi no 150 pre release event. He tweeted sensational tweets which blocks everyone minds.

‘ఖైదీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాంగోపాల్మ వర్మని నాగబాబు ఉతికిపారేశారు. ఆ సినిమాకి వ్యతిరేకంగా ట్విటర్‌లో ట్వీట్ చేశాడని.. ‘అక్కుపక్షిలా కూతలు కుయ్యకుండా, నీ పని నువ్వు చూసుకో’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ‘దర్శకుడిగా నీ గ్రాఫ్ పడిపోయింది.. మంచి సినిమాలు తీసి కెరీర్‌ని సక్రమంగా మలుచుకో.. నువ్వు పేల్చే బాంబులేదో ముంబైలో పేల్చుకో.. ఎన్ని కూతలు కూసినా ఒక సూపర్ హిట్ సినిమాను తొక్కలేవు.. ఫెయిల్యూర్ సినిమాను లేపలేవు’ అంటూ భారీ పంచ్ కూడా ఇచ్చాడు. ఈ విధంగా నాగబాబు కామెంట్స్ చేయడంతో వర్మ ఎలా స్పందిస్తాడా? అని ఆతృతగా ఎదురుచూశారు.

తీరా చూస్తే.. ‘నా కామెంట్స్ హర్ట్ చేసి ఉంటే మీకు, చిరంజీవికి సారీ చెబుతున్నాను’ అని వర్మ ట్వీట్ చేశాడు. దీంతో.. అతని ఫాలోవర్స్ ఖంగుతినే వంతు వచ్చింది. అసలు సంచలనాలకే కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ.. ఇంత సింపుల్‌గా సారీ చెప్పాడేంటి? అని ఆశ్చర్యంలో మునిగిపోయారు. కానీ.. కాసేపయ్యాక వర్మ తన అసలు రూపం చూపించాడు. తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నాగబాబుని దారుణంగా ఏకిపారేశాడు. తొలుత తన అకౌంట్ హ్యాక్ అయిందని, ఆ ట్వీట్స్ తాను చేయలేదని.. ఆ వెంటనే హ్యాక్ కాలేదని, ఆ ట్వీట్స్ ఎవడో చేశాడని పిచ్చిపిచ్చిగా ట్వీట్లు పెట్టాడు. తనకు తెలుగులో ట్వీట్లు చేసే అలవాటు లేదని అంటూ మరికొన్ని ట్వీట్లతో నాగబాబుపై విరుచుకుపడ్డాడు. ‘నాగబాబు సార్‌.. మీకు ఇంగ్లీష్‌ అర్థంకాదు. అందువల్ల ఎవరినైనా పిలిపించి నా ట్వీట్లను తెలుగులోకి అనువాదం చేయించుకోండి. చిరంజీవితో ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టించి ఎంతగా నష్టపరిచారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ సోదరునికున్న గొప్పతనంలో మీకు 0.1 శాతం కూడా లేదు. అందుకే మీలాగా ఆయన అనవసర వ్యాఖ్యలు చేయరు’ అని అన్నాడు. అంతటితో వర్మ ఆగలేదు.. మరింత రెచ్చిపోయాడు.

‘నాగబాబు సార్.. నా కెరీర్ మీద చాలా ఫ్యామిలీస్ ఆధారపడి బ్రతుకుతున్నాయి.. కానీ మీ కెరీర్ మాత్రం కేవలం మీ బ్రదర్ కెరీర్ మీదే నడుస్తోంది.. నేను కావాలంటే దీనిపై మరిన్ని ట్వీట్లు చేయగలను’ అని అన్నాడు. ఆ తర్వాత ‘నాగబాబు సార్.. ఇకపై మీరు మీ బ్రదర్స్‌ని సంతృప్తిపరచడంపై దృష్టి సారించండి.. అక్కుపక్షుల మీద టైమ్ వేస్ట్ చేసుకోకండి.. లేకపోతే మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారు.. ఆల్ ది బెస్ట్’ అని ట్వీటాడు. అనంతరం చిరుకి ఓ సలహా కూడా ఇచ్చాడు. ‘చిరంజీవిగారు.. నాగబాబు మీ తమ్ముడని తెలుసు, ఆయన్ను మీరు ఎంతగా ప్రేమిస్తారన్న విషయం కూడా తెలుసు. కానీ.. భవిష్యత్తులో దయచేసి ఇలాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్లకు మాత్రం నాగబాబుని తీసుకురాకండి.. లేకపోతే నాశనం చేస్తాడు’ అని సంచలన ట్వీట్ చేశాడు వర్మ. మరి.. ఈ ట్వీట్లపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

varma-twitter-to-nagababu

More from my site