శాతకర్ణికి జోహార్లు.. ఖైదీకి చురకలు.. ట్విటర్‌లో మళ్ళీ జూలు విదిల్చిన వర్మ

ram gopal varma controversial tweets on khaidi no 150

Ram Gopal Varma create sensation another time by making controversial tweets on Khaidi no 150 indirectly after GPSK getting humongous report all over.

‘ఖైదీ నెంబర్ 150’కి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదలైనప్పటి నుంచి రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఆ సినిమాపై సెటైర్లు వేస్తూ వస్తున్నాడు. దాదాపు దశాబ్దకాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చిరు.. రీమేక్ ఎంచుకోవడమేంటని ప్రశ్నని కూడా పరోక్షంగా సంధించాడు. ఫోటో దగ్గర నుంచి ట్రైలర్ వరకు.. ప్రతి ఒక్క దానిపై ఏదో ఓ కామెంట్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మరోసారి ఆ మూవీకి చురకలంటించాడు వర్మ. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి అన్నివైపుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండడంతో.. ఆ మూవీ టీంకి శుభాకాంక్షలు తెలుపుతూ, ఖైదీ సినిమాపైనే కాకుండా మెగాహీరోలపైనా సంచలన ట్వీట్లు చేశాడు.

‘హే క్రిష్.. శాతకర్ణి సినిమాపై నేనిచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ అయినందుకు నేను చాలా థ్రిల్ అవుతున్నా.. ఈ సినిమాకి అన్నిచోట్ల నుంచి రోరింగ్ టాక్ వస్తున్నందుకు శుభాకాంక్షలు.. నీకు, బాలయ్యగారికి చీర్స్’ అంటూ ట్వీట్ చేసిన వర్మ.. రెండో ట్వీట్ నుంచి ఖైదీపై విరుచుకుపడ్డాడు. ‘పక్క ఇండస్ట్రీ నుంచి ఓ కథని అరువుగా తీసుకుని టాలీవుడ్ స్థాయిని దిగజార్చేలా కాకుండా, ఒరిజినల్ కంటెంట్‌తో తారాస్థాయికి తీసుకెళుతున్నందుకు క్రిష్ – బాలయ్యలకు సెల్యూట్ చేస్తున్నా’ అని ట్వీటాడు. అలాగే.. పాత ఫార్ములా స్టఫ్‌తో కాకుండా ఆడియెన్స్ ఇంటెలిజెన్స్‌ని దృష్టిలో పెట్టుకుని చిరకాలంగా నిలిచిపోయే ఓ అద్భుత కళాఖండాన్ని రూపొందించారని మరొక ట్వీట్‌లో పేర్కొన్నాడు. బాహుబలిలాగే శాతకర్ణి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతోందని.. ఇప్పటికీ మెగాపీపుల్ ఈ విషయాన్ని గ్రహించకపోతే వాళ్లు ‘మిని’ కిందకే వస్తారని అన్నాడు. ఈ విధంగా వర్మ చేసిన ట్వీట్.. మరెన్ని వివాదాలకు దారితీస్తుందో చూడాలి.

More from my site