Moviesసోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న రామ్ చరణ్ రామాయణం

సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న రామ్ చరణ్ రామాయణం

బాహుబలి సినిమా ప్రపంచ స్థాయిలో కలెక్షన్ల సునామీ తో 1000 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సీనిమా ఏ మూహుర్తాన విడుదలయిందో కానీ నిర్మాతలకి భాషతో సంబంధం లేకుండా తమ బిజినెస్ పరిధులకి హద్దే లేదని నిరూపించింది. మొన్నామధ్య దుబాయ్ బిజినెస్ మ్యాన్ ఒకతను 1000 కోట్ల బడ్జెట్ తో మోహన్ లాల్ ప్రధానపాత్రలో ‘మహాభారతం’ సినిమాని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇక మన తెలుగు బడా నిర్మాత అల్లు అరవింద్ మరో ఇద్దరితో కలిపి 500 కోట్ల రూపాయలతో ‘రామాయణం’ సినిమాని ప్రకటించాడు. బాహుబలి ప్రభంజనంతో కొంచెం చల్లబడ్డ మెగా అభిమానులు ఇక తమ క్రియేటివిటీ కి పదును పెట్టి రామ్ చరణ్ రామాయణం అంటూ సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తున్నారు. ఏమాటకామాటే గానీ ఫోటో డిజైన్ మాత్రం సూపర్బ్ గా ఉంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి డిజైన్ కూడా ఒక రేంజ్ లో సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టించిన మెగా అభిమానులు ఇప్పుడు రామ్ చరణ్ రామాయణం తో మరింతగా హల్ చల్ చేస్తున్నారు. రామ్ చరణ్ పాత్రనే కాక అల్లు అర్జున్ ఆంజనేయుడి గా అంటూ కొత్త డిజైన్ కూడా రాబోతుందంట. రామ్ చరణ్ రాముడిగా.. అల్లు అర్జున్ ఆంజనేయుడిగా.. విలన్ రావణాసురిడిగా రానా నే అని అందరూ సూచిస్తున్నట్లు వినికిడి. అదే నిజమైతే ఇక బాహుబలి ని మించిన కలెక్షన్లు రాబట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నట్లుగానే భావించాలి. కానీ రాజమౌళి కాకుండా ఈ ప్రాజెక్ట్ ఎవరు చేసినా కూడా అది కత్తి మీద సామే.. ఏమంటారు ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news