Gossipsబన్నితో ఓవర్ చేశాడు.. చరణ్ దగ్గరకి రానివ్వట్లే..!

బన్నితో ఓవర్ చేశాడు.. చరణ్ దగ్గరకి రానివ్వట్లే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో డిజె అంటూ నానా హంగామా చేసిన హరిష్ శంకర్ ఆ సినిమా తర్వాత రాం చరణ్ కు సరిపడే కథను సిద్ధం చేశాడట. దిల్ రాజు సహాయంతో హరిష్ శంకర్ చరణ్ ను కలిసే ప్రయత్నం చేసినా చరణ్ మాత్రం హరిష్ తో సినిమా కాదు కూదడు అనేశాడట. దిల్ రాజు భరోసా ఇచ్చినా సరే బన్ని డిజె సినిమా అతి చేశాడు కాబట్టే చరణ్ హరిష్ ను దగ్గరకు రానివ్వట్లేదట.

ఇక అదో రీజన్ అయినా నేను లోకల్ తో హిట్ అందుకున్న నక్కిన త్రినాధరావుతో సినిమా చేస్తా అంటున్నాడట చరణ్. దిల్ రాజు బ్యానర్లో ఎవడు సినిమా చేసిన చరణ్ ఆ తర్వాత దిల్ రాజుకి ఛాన్స్ ఇవ్వలేదు. మరోసారి చెర్రితో సినిమా చేయాలని దిల్ రాజు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట. దిల్ రాజు సినిమాకు చూచాయగా ఓకే చెప్పినా దర్శకుడిగా త్రినాధరావుని సూచించాడట చరణ్.

త్రినాధరావు తనని మెప్పించే కథ తెస్తే అతని డైరక్షన్ లో సినిమా చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడట చరణ్. మొత్తానికి చరణ్ బన్ని డైరక్టర్ ను కాదని ఓ చిన్న సినిమా దర్శకుడితో సినిమా ఓకే చేశాడన్నమాట. రంగస్థలం తర్వాత చరణ్ ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. మరి అది కచ్చితంగా నక్కిన త్రినాధరావుతోనేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news