Movies‘ధృవ’ 11 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.. సెకండ్ మండే ఫర్వాలేదనిపించిన...

‘ధృవ’ 11 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.. సెకండ్ మండే ఫర్వాలేదనిపించిన రామ్ చరణ్

Ram Charan’s latest film Dhruva 11th day worldwide collections are out and it eaned very well than expected. Finally this movie going to enter in 50 crore club.

గత శుక్రవారం విడుదలైన చిన్న సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం, అదే సమయంలో రామ్ చరణ్ ‘ధృవ’ మూవీ రెండో వారాంతంలో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టడం చూసి.. ఆ తర్వాత వర్కింగ్ డేస్‌లలో కూడా దీని ప్రభంజనం కొనసాగుతుందని భావించారు. అనుకున్నట్లుగానే ఈ మూవీ చెప్పుకోదగ్గ వసూళ్లు కలెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఫస్ట్ వీక్‌లోని బుధ, గురు వారాలతో పోల్చుకుంటే.. రెండో సోమవారం కలెక్ట్ చేసిన కలెక్షన్లు ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం సెకండ్ మండే అంటే 11వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 1.60 కోట్లు కొల్లగొట్టింది. అదే ఫస్ట్ వీక్‌లోని గురువారం (7వ రోజు) ఈ మూవీ అంతకంటే తక్కువే వసూలు చేసింది. నిజానికి.. రోజులు గడిచేకొద్దీ వసూళ్లు తగ్గుతూ వస్తాయి. కానీ.. ‘ధృవ’ విషయంలో మాత్రం రిజల్ట్ పూర్తిగా భిన్నంగా వస్తోంది. బహుశా గత శుక్రవారం వచ్చిన మూవీలు ఫెయిల్ కావడమే దీనికి కలిసొచ్చిందేమోనని అనుకుంటున్నారు. ఏదేమైనా.. ‘ధృవ’ వసూళ్లు ఇలా పెరగడం పట్ల యూనిట్‌తోపాటు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పదకొండో రోజు ఈ మూవీ రాబట్టిన కలెక్షన్లని గత పదిరోజుల వసూళ్లతో కలుపుకుంటే.. మొత్తం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.49.65 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ లెక్కలు స్పష్టం చేశాయి. ఏరియాల వారీగా ఈ మూవీ కలెక్షన్స్ (కోట్లలో) క్రింది విధంగా ఉన్నాయి..

నైజాం : 12.85
సీడెడ్ : 5.81
ఉత్తరాంధ్ర : 4.5
గుంటూరు : 3
ఈస్ట్ గోదావరి : 2.69
కృష్ణా : 2.55
వెస్ట్ గోదావరి : 2.30
నెల్లూరు : 1.15
ఏపీ+తెలంగాణ : రూ. 34.85 కోట్లు (షేర్)
ఓవర్సీస్ : 7
కర్ణాటక : 6.3
రెస్టాఫ్ ఇండియా : 1.5
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 49.65 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news