Gossipsఇది కదా రామ్ చరణ్ రేంజ్ అంటే... బోయపాటి సినిమాకు దిమ్మ...

ఇది కదా రామ్ చరణ్ రేంజ్ అంటే… బోయపాటి సినిమాకు దిమ్మ దిరిగే రికార్డు ప్రైస్..!

కొన్నాళ్లు వెనుకపడ్డట్టు కనిపించినా ధ్రువ హిట్ తో సత్తా చాటి రంగస్థలం తో రికార్డులు ఎప్పుడైనా నావే అంటూ చాటి చెప్పిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం చేస్తున్న బోయపాటి శ్రీను సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే 21 కోట్ల భారీ డీల్ సెట్ చేసుకున్నారు. తెలుగులో కాదు ఈ సినిమా నార్త్ ఇండియా రైట్స్ ఈ రేటుకి వెళ్లడం జరిగింది. బాలీవుడ్ లో రాం చరణ్ ఇప్పటికే ఎంట్రీ ఇచ్చాడు. అయితే స్ట్రైట్ సినిమాలతో ఫెయిల్ అయినా చరణ్ తెలుగు సినిమాలకు అక్కడ బాగానే డిమాండ్ ఉంది.

రంగస్థలం తర్వాత మూవీ కావడం బోయపాటి లాంటి సక్సెస్ ఫుల్ డైరక్టర్ చేస్తుండటంతో ఈ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. జయ జానకి నాయకా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రాం చరణ్ స్టామినా ప్రూవ్ చేస్తుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news