Newsభరత్ భామ.. చరణ్ కు చుక్కలు చూపించింది..!

భరత్ భామ.. చరణ్ కు చుక్కలు చూపించింది..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరీఓగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా భరత్ అనే నేను భామ కియరా అద్వాని సెలెక్ట్ అయ్యింది. బాలీవుడ్ నుండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పాగా వేయాలని చూస్తుంది. మహేష్ పక్కన మొదటి ఛాన్స్ అందుకున్న ఈ భామ తెలుగులో భరత్ అనే నేను క్రేజీ హిట్ కొట్టింది.

ఇక చరణ్ సినిమా కోసం బాగానే హార్డ్ వర్క్ చేస్తుంది. సినిమాలో రాం చరణ్ ఫిట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. అందుకే సినిమాలో ఫిట్ లుక్ కోసం బాగా వర్క్ అవుట్స్ చేస్తున్నాడట. చరణ్ తో పాటుగా కియారా అద్వాని కూడా ఈ వర్క్ అవుట్స్ లో పాల్గొంటుంది. ఈ జిం వర్క్ అవుట్స్ లో చరణ్ కే అమ్మడు చుక్కలు చూపిస్తుందట.

ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో సంచలనంగా మారింది. డివివి దానయ్య నిర్మిస్తున్న బోయపాటి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దసరా బరిలో దిగేలా ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు.

https://www.youtube.com/watch?v=-ir0JURJ23A

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news