Gossipsఆ స్టార్ హీరో కోసం ఆరాటపడుతున్నరకుల్...!

ఆ స్టార్ హీరో కోసం ఆరాటపడుతున్నరకుల్…!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయకున్నా సరే ఇంకా తెలుగు సినిమాల మీద గురి తప్పనివ్వలేదు. స్పైడర్ తర్వాత ఇక్కడ అవకాశాలు తగ్గినా కోలీవుడ్ లో మాత్రం అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం కార్తితో సినిమా చేస్తున్న రకుల్ తెలుగులో త్వరలో ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తున్నానని అంటుంది.

ఈమధ్యనే తన పేరు మీద ఓన్ యాప్ ఒకటి డిజైన్ చేయించిన రకుల్ దానిలో మొదటిగా తనకు టాలీవుడ్ లో ఏ హీరోతో నటించాలని ఉందో చెప్పేసింది. ఇంతకీ రకుల్ ఏరి కోరి నటించాలనుకున్న హీరో ఎవరంటే అది మరెవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని తెలుస్తుంది. రకుల్ ప్రభాస్ ఆఫర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుందట.

మరి అమ్మడు రివీల్ చేయనున్న ఆఫర్ ప్రభాస్ దే అయ్యుంటుందా అని కూడా ఆరా తీస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత జిల్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఆ సినిమాను కూడా యువి క్రియేషన్స్ వారే నిర్మిస్తారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news