Gossipsర‌కుల్‌కు అలాంటి సినిమా కావాల‌ట‌..

ర‌కుల్‌కు అలాంటి సినిమా కావాల‌ట‌..

గ్లామర్ రోల్స్ చేసీ చేసీ బోర్ కొట్టేసిందేమో అందుకే మిగతా హీరోయిన్లలా ప్రత్యేకమైన కేరెక్టర్లు ప్లే చేసి.. టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని చూస్తోంది అందాల రాశి రకుల్ ప్రీత్ సింగ్. ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఏదో ఒక తీరని కోరిక మిగిలే ఉంటుంది ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్ లోనే ఉంది రకుల్.

సినిమాల్లో హీరోలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉండడం సహజమని.. కలెక్షన్లను కూడా.. హీరోలు ప్రభావితం చేయగలరని రకుల్ చెబుతోంది. అయితే.. హీరోయిన్ త‌న పోస్టర్ చూసి కూడా.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే రోజులు రావాలని తన ఆశ అని ఈ ముద్దు గుమ్మ చెబుతోంది. తనకూ అలాంటి సినిమా చేయాలని ఆశగా ఉందని చెప్తోంది.

దీపికా.. పీకూ లాంటి ప్రయోగాత్మక సినిమా చేసిందని, ఆలియా భట్ లాంటి యువ హీరోయిన్లు కూడా ప్రయోగాలు చేస్తున్నారని వారిలాగే.. తను కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేయాలనుకుంటున్నట్టు తన మనసులో మాటను బయటపెట్టేసింది రకుల్. ఇంకా చెప్పాలంటే.. అనుష్కకు అరుంధతిలా.. కలకాలం చెప్పుకునే ఓ సినిమాను తాను చేయాలని చూస్తున్నానని.. అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోనని చెప్తోంది ఈ స్లిమ్ బ్యూటీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news