Gossipsరవి తేజ ను టచ్ చేయనంటోన్న టాప్ హీరోయిన్ ఎవరు..?

రవి తేజ ను టచ్ చేయనంటోన్న టాప్ హీరోయిన్ ఎవరు..?

కొంతకాలం అపజయాలతో నెట్టుకొచ్చి ఇక ఇంతటితో కెరియర్ ముగిసింది అనుకుంటున్న సమయంలో రాజా ది గ్రేట్ అని అనిపించుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రవితేజకి వరుస పెట్టి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం టచ్ చేసి చూడు సినిమా షూటింగ్ తో ఈ మాస్ మహారాజ్ బిజీ గా ఉన్నాడు. విక్రం సిరి కొండ దర్శత్వం వహిస్తున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశ లో ఉంది. ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది. కానీ ఆ విషయాన్నీ మాత్రం బయటకి పొక్కకుండా ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఈ సినిమా తరువాత రవితేజ, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

డిసెంబర్ నెల ఆఖరిలో షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్న ఈ సినిమాని వచ్చే సంవత్సరం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశ లో ఉన్న కళ్యాణ్ కృష్ణ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్ని వెతికే పనిలో పడ్డారు. అయితే కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా లో రవితేజ కి జోడి గా రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చేసాడట. ఈ విషయాన్ని రకూల్ దగ్గర కూడా ప్రస్తావించినట్టు సమాచారం.

అయితే ఈ ఆఫర్ ని రకూల్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. రవితేజతో జతకట్టేందుకు ఈ అమ్మడు సిద్ధంగా లేదని సమాచారం. ఇదే విషయాన్ని కళ్యాణ్ కృష్ణ కి చెప్పడంతో ఇంకో హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడు దర్శకుడు. ప్రస్తుతానికి రకుల్ ప్రీత్ చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. అయినా ఈ అమ్మడు ఈ సినిమా చెయ్యడానికి ఎందుకు నిరాకరించినట్టు అనే సందేహం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news