Gossipsరకూల్ కి చాలా ఉంది .. అందుకే నో చెప్పింది

రకూల్ కి చాలా ఉంది .. అందుకే నో చెప్పింది

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్టేటస్ కొట్టేసిన రకూల్ ప్రీతీ సింగ్ జయాపజయాలతో సంభంధం లేకుండా మంచి మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. వరుస ఆఫర్లతో మంచి బిజీగా మారిపోయిన ఈ హీరోయిన్ అన్ని ఆఫర్లు ఒప్పుకోకుండా తనకు ఆ సినిమాలో ఎటువంటి పాత్ర ఉండబోతోంది..? ప్రాధాన్యం ఉందా లేదా అనే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని మరీ ముందు అడుగులు వేస్తోంది. ఒక టాప్ హీరో ఏడాదికి ఒక సినిమా చేసి సరిపెట్టుకుంటుంటే … రకూల్ మాత్రం ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ .. టాప్ హీరోలకు కూడా సవాల్ విసురుతోంది.

ఈ మధ్య కాలంలో రకూల్ చేసిన సినిమాల్లో ఒక్క సినిమా తప్ప మిగతా అన్నీ పెద్దగా పెద్దగా విజయాలను నమోదు చేసుకోకపోవడంతో కొంచెం వెనక్కు వెళ్లినట్టు కనిపించింది. స్పైడర్ సినిమాపై ఈ ముద్దు గుమ్మ ఎంతో ఆశ పెట్టుకుంది. కానీ ఆ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని మిగిల్చింది. అయినా రకుల్ కి అవకశాలను ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో అయ్యారి సినిమాతో పాటు సౌత్ మరో మూడు సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా లవ్ స్టోరీలు వస్తే ఏ మాత్రం వదులుకొను అంటోంది. కానీ రకుల్ తాజాగా రవితేజ పక్కన నటించే అవకాశం వచ్చినా అందుకు మొహమాటం కూడా లేకుండా నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రవితేజ పక్కన కిక్ -2 సినిమాలో నటించిన ఈమె ఆ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఆ కంబినేషన్ లో చేసేందుకు జంకుతుందేమో అన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news