Gossipsమహేష్ పై ఘాటైన కామెంట్స్ చేసిన రకుల్

మహేష్ పై ఘాటైన కామెంట్స్ చేసిన రకుల్

అందాల భామ రకుల్ త‌న‌దైన మాట తీరుతో ఇత‌రుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో దిట్ట‌.
సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస ఛాన్స్‌లు కొట్టేస్తున్న సోయ‌గం.
ఇటీవ‌ల తెలుగు త‌మిళ రంగాల్లో బిజీబిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ మ‌హేశ్ సిన్మాపై ఓ కామెంట్ చేసింది.

అదేంటంటే..
ఈ ఏడాది భారీ అంచనాల మధ్య రిలీజైన చిత్రాల్లో స్పైడర్ కూడా ఒకటి. ఇటీవల రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపో యింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తన మార్కు చూపించుకోలేకపోయింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతోనే కోలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా రకుల్ నటించిన ఖాకీ సినిమా విడుదలకి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె స్పైడర్ సినిమా ఫెయిల్యూర్ పై స్పందించింది.నేను గతాన్ని తవ్వుకోదల్చుకోలేదు..కొన్ని సినిమాలు అనుకున్నట్టుగా విజయం సాధిస్తాయి. ఇంకొన్ని సినిమాలు అపజయం పాలవుతాయి. ఇందులో అనుకోవడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించింది. కానీ ఏ సినిమా విష‌యంలోనైనా తాను వంద‌శాతం కృషి చేస్తాన‌ని చెప్పింది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news