Gossipsరాజమౌళి ని కదిలించిన గరుడ వేగా..

రాజమౌళి ని కదిలించిన గరుడ వేగా..

యాంగ్రీ యంగ్ మన్ నటించిన గరుడవేగ సినిమా హిట్ టాక్ రాజమౌళికి తాకింది. నిన్న రిలీజ్ అయిన మూడు సినిమాల్లో గరుడవేగ సినిమా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ చూసి రాజమౌళి ఈ సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆదివారం సినిమా చూసేందుకు వెళ్తున్నాం అంటూ ట్వీట్ చేశాడు.

ఇక సినిమా ఎలాగు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రాజమౌళి కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రాజమౌళి సినిమా గురించి ఏం చెబుతారు అన్న విషయం మీద ఇప్పుడు అందరి ఎక్సయిట్మెంట్ ఉంది. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో పూజా కుమార్ హీరోయిన్ గా నటించింది.

రాజశేఖర్ ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. పాతిక కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లోనే 3 కోట్ల కలక్షన్స్ తెచ్చిందని అంటున్నారు. రాజశేఖర్ కెరియర్ లో ఈ సినిమా మంచి హిట్ బొమ్మ అవుతుందని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news