Movies‘శాతకర్ణి’ బడ్జెట్.. ఇండస్ట్రీ షేక్!

‘శాతకర్ణి’ బడ్జెట్.. ఇండస్ట్రీ షేక్!

Director Krish has revealed the budget of Gautamiputra Satakarni movie which shocked whole Telugu film industry. Even ace director Rajamouli’s mind blocked after knowing this news.

చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన సినిమాని తెరకెక్కించాలంటే.. భారీ బడ్జెట్ కేటాయించాల్సిందే. గ్రాఫిక్స్, సెట్టింగ్స్, క్యాస్టింగ్, వందలాదిమంది జూనియర్ ఆర్టిస్టులు, టెక్నికల్ టీమ్, ఇంకా ప్రొడక్షన్ వర్క్స్‌కి అయ్యే ఖర్చులన్నీ కలుపుకుంటే.. రూ.100 కోట్లపైనే బడ్జెట్ అవుతుంది. అంతేకాదు.. షూటింగ్ కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఉదాహరణగా.. ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ సినిమాలకు తీసుకోవచ్చు.

గుణశేకర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’కి తొలుత రూ.50 కోట్లు బడ్జెట్‌గా నిర్దేశించుకోగా.. చివరికి అది రూ.100 కోట్లకు చేరింది. పైగా.. ఈ మూవీని తెరకెక్కించడానికి ఏడాదికిపైగానే సమయం పట్టింది. ఇక ‘బాహుబలి’ సినిమా విషయానికొస్తే.. ఈ మూవీ కోసం దర్శకధీరుడు రాజమౌళి రూ.150 కోట్లపైనే ఖర్చు చేయించాడు. ఇక షూటింగ్ కోసం ఏకంగా మూడేళ్లపైనే సమయం తీసుకున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్టింగ్స్ వేయడం కోసమే మూడు నెలలు టైం పట్టింది. ఇక క్లైమాక్స్ వార్ సీన్ కోసం కూడా దాదాపు అంతే సమయం కేటాయించాడు రాజమౌళి.

కానీ.. దర్శకుడు క్రిష్ మాత్రం క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల చివరి చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నిజజీవితం ఆధారంగా తెరకెక్కించిన హిస్టారికల్ సినిమాని కేవలం రూ.55 బడ్జెట్‌లో, 8 నెలలో తక్కువ టైంలోనే ముగించాడు. అది కూడా సుపీరియర్ క్వాలిటీతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇక్కడే.. డైరెక్టర్ క్రిష్ హైలైట్ అయ్యాడు. దిగ్గజ దర్శకులందరూ ఈ తరహా సినిమాలు తీయడానికి నానాతంటాలు పడుతుంటే.. క్రిష్ మాత్రం అవలీలగా తీసిపడేశాడు. తీయాలని కసి ఉంటే.. ఎక్కువ బడ్జెట్, సమయం కేటాయించాల్సిన అవసరం లేదని నిరూపించాడు.

ఇలా ఈ చిత్రాన్ని ఆ బడ్జెట్, తక్కువ సమయంలోనే ముగించడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో ఉంది. దిగ్గజ దర్శకులు ఎక్కువ సమయంతోపాటు భారీ బడ్జెట్ కేటాయిస్తుంటే.. క్రిష్ మాత్రం నిర్దేశించుకున్న టైం, బడ్జెట్‌లోనే కళ్లుచెదిరే విజువల్స్‌తో, భారీతనంతో సినిమాని తెరకెక్కించి ఔరా అనిపించాడు. ‘శాతకర్ణి’ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే.. రాజమౌళి తర్వాతి స్థానం క్రిష్‌దేనని అంతా చెప్పుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news