Newsసింహాద్రి, మగధీర తప్పుడు లెక్కలు బయటపెట్టిన రాజమౌళి...ఫేక్ రికార్డుల కోసం మాట...

సింహాద్రి, మగధీర తప్పుడు లెక్కలు బయటపెట్టిన రాజమౌళి…ఫేక్ రికార్డుల కోసం మాట తప్పిన అల్లు అరవింద్

మగధీర సినిమా తర్వాత రాజమౌళి వర్సెస్ మెగా ఫామిలీ చాలా రూమర్లు వచ్చాయి. అందులో ప్రముఖంగా రాజమౌళికి మగధీర విజయంలో సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదనే గాసిప్ ని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. అందుకే రామ్ చరణ్ తోనే కాదు ‘సునీల్’ తో మరియు ‘ఈగ’ తో కూడా హిట్ కొట్టగలను అని రాజమౌళి ‘మర్యాద రామన్న’ మరియు ‘ఈగ’ సినిమాలు తీసినట్లుగా ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఆ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.. అది వేరే విషయం.

ఇక అసలు విషయానికొస్తే ABN ఆంధ్రజ్యోతి లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కే. లో పాల్గొన్న రాజమౌళి, అల్లు అరవింద్ తో ఉన్న కోప తాపాలపై హోస్ట్ అడిగిన ప్రశ్నలకి ఇంతవరకు ఎవరికీ తెలియని ఎన్నో విషయాలని మన ముందుంచారు రాజమౌళి.అంతకుముందు సింహాద్రి 175 రోజుల వరకు కొన్ని థియేటర్లలో కావాలని ఆడించటం నచ్చని రాజమౌళి, మగధీర ముందు అల్లు అరవింద్ తో ఒక చిన్న ఒప్పందం చేసుకున్నారంట. అదేమిటంటే ” ఫేక్ రికార్డుల కోసం థియేటర్లలో కావాలని సినిమాని బలవంతంగా ఆడించవద్దు అని”. ఆ చెత్త ఫేక్ రికార్డుల సంస్కృతి కి ఫుల్ స్టాప్ పెడదామని ఒక ఒప్పందానికి వచ్చారంట. అయితే సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ.. అత్యధిక థియేటర్లలో 100 రోజుల రికార్డు కోసం అల్లు అరవింద్ తనపై ఉన్న ఫ్యాన్స్ ఒత్తిడి కారణంగా కొన్ని థియేటర్లలో బలవంతంగా ఆడించారు. ఈ విషయం నచ్చని రాజమౌళి 100 రోజుల ఫేక్ ఫంక్షన్ కి తాను రాలేనని చెప్పి వెళ్ళలేదంట. పూర్తి వివరాలకోసం క్రింద వీడియో ని చూడండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news