Movies ‘శాతకర్ణి’ ట్రైలర్‌కి ముగ్ధుడైన రాజమౌళి.. క్రిష్‌కి హ్యాట్సాఫ్

‘శాతకర్ణి’ ట్రైలర్‌కి ముగ్ధుడైన రాజమౌళి.. క్రిష్‌కి హ్యాట్సాఫ్

Tollywood ace director SS Rajamouli praises Satakarni Trailer and Krish Team for making this historical movie in just 8 months of time span with a very good quality.

శుక్రవారం సాయంత్రం విడుదలైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ చూసి ప్రతిఒక్కరూ దానికి దాసోహం అయిపోతున్నారు. ఎందుకంటే.. కేవలం 8 నెలల సమయంలో ఇంతటి భారీ సినిమాని కళ్ళుచెదిరేలా ఔట్‌పుట్ తేవడంలో క్రిష్ బృందం నూటకి నూరు శాతం సక్సెస్ అయ్యింది. ట్రైలర్‌లో కనిపించే విజువల్స్‌ని చూసి ఆశ్చర్య పోవాల్సిందే. లక్షలాదిమంది సైన్యం, భారీఎత్తున భవంతులు, ఉత్తేజం నింపే వార్ సన్నివేశాలు చూస్తే.. ఎవ్వరైనా పూనకంతో ఊగిపోతారు. ఆల్రెడీ ఈ ట్రైలర్‌కి తారక్ ఫిదా అయిపోగా.. గ్రేట్ మేకర్‌ రాజమౌళి సైతం ముగ్ధుడైపోయాడు. ట్విటర్ వేదికగా ప్రశంసలు జల్లు కురిపించాడు.

‘గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ అదిరింది.. రాజులా, వారియర్‌లా బాలయ్య గంభీరంగా కనిపించారు. కేవలం 8 నెలల్లోనే ఈ రేంజ్ క్వాలిటీ, ఔట్‌పుట్ తీసుకొచ్చిన దర్శకుడు క్రిష్‌కి హ్యాట్సాఫ్. ట్రైలర్ మైండ్ బాగ్లింగ్‌గా ఉంది’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. దేశవ్యాప్తంగా గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడైన జక్కన్న.. ‘శాతకర్ణి’ ట్రైలర్‌పై అలా ప్రశంసలు కురిపించండంతో.. నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే.. ‘బాహుబలి’ చిత్రం కోసం జక్కన్న మూడేళ్లు సమయం తీసుకుంటే.. అదే స్థాయిలో కాకపోయినా దానికి ధీటుగా ఉండేలా ‘శాతకర్ణి’8 నెలల్లోనే క్రిష్ ముగించడం గర్వించదగ్గ విషయమే. ఈ అభిప్రాయంతోనే జక్కన్న దర్శకుడు క్రిష్‌ని కొనియాడాడని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news