‘నమ్మశక్యం కావడం లేదు.. క్రిష్ నీ నుంచి చాలా నేర్చుకోవాలి’ : శాతకర్ణిపై రాజమౌళి రివ్యూ

rajamouli praises gautamiputra satakarni krish balayya

Tollywood ace director SS Rajamouli praises Gautamiputra Satakarni movie after watching premieres. He salute Balayya for potraying Satakarni role, and praises Krish for making this epic in just 79 days.

బుధవారం రాత్రి నుంచి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సందడి మొదలైంది. ఎక్కడచూసినా ఈ చిత్రం గురించే మాట్లాడుతున్నారు. ప్రీమియర్స్ చూసిన ప్రతిఒక్కరూ.. నిజంగానే ఈ చిత్రం తెలుగోడి మీసం తిప్పేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రిష్ ఓ అద్భుతమైన కళాఖండాన్ని చూపించాడని, బాలయ్య వీరోచిత నటనతో ఆకట్టుకున్నారని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి అయితే పొగడ్తల వర్షం కురిపించేశాడు. దర్శకుడు క్రిష్, బాలయ్య, చిత్రబృందం పనితనాన్ని తారాస్థాయిలో కొనియాడాడు.

‘సాహో బసవతారక పుత్ర బాలకృష్ణ.. శాతకర్ణిలాంటి గొప్ప పాత్ర పోషించినందుకు సెల్యూట్.. అలాంటి గొప్ప క్యారెక్టర్‌లో ఒదిగిపోయిన తీరుకి నందమూరి రామారావుగారు గర్విస్తారు.. పైనుంచి ఆయన ఆశీస్సులు అందుతాయి. అంజనాపుత్ర క్రిష్.. నీకు 12కోట్ల తెలుగు ప్రజల దీవెనెలు ఎప్పుడూ వుంటాయి. అసలు ఇలాంటి చారిత్రాత్మక చిత్రాన్ని కేవలం 79 రోజుల్లో ఎలా రూపొందించావ్? నిజంగా నమ్యశక్యం కావడం లేదు. క్రిష్ నీ నుంచి నేను చాలా చాలా నేర్చుకోవాలి. సాయిమాధవ్ గారూ.. మీ కలం శాతకర్ణి ఖడ్గంతో సమానం. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు అద్భుతం. ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది’ అని ఈ చిత్రంపై రాజమౌళి తన రివ్యూ ఇచ్చాడు. ఈ విధంగా జక్కన్న నుంచి స్పందన రావడంతో.. నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

More from my site