Gossipsజక్కన్న చేతికి చిక్కేది ఎవరో....? తెలిస్తే షాకే...

జక్కన్న చేతికి చిక్కేది ఎవరో….? తెలిస్తే షాకే…

బాహుబలి తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడు అన్న విషయం మీదే టాలీవుడ్ లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఎవరికి వారు ఊహాగానాలు అల్లేస్తుంటే ఫైనల్ గా మాత్రం ఓ ఇద్దరు హీరోలతో సినిమా ఉంటుందని అంటున్నారు. రాజమౌళితో ఎన్నాళ్ల నుండో సినిమా చేయాలని చూస్తున్న మహేష్ అతనితో సినిమా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆల్రెడీ కె.ఎల్ నారాయణ ఈ ఇద్దరి కాంబినేషన్ కు అడ్వాన్సులు కూడా ఇచ్చి ఉన్నాడు.

ఇక మహేష్ కాకుంటే మరోసారి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో రాజమౌళి సినిమా ఉంటుందని టాక్. ఎన్.టి.ఆర్ తో రాజమౌళి సినిమా అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. బాహుబలి తర్వాత ఓ మినిమం బడ్జెట్ సినిమా చేస్తాడేమో అన్న వార్తలకు షాక్ ఇస్తూ మహేష్ తో చేసినా ఎన్.టి.ఆర్ తో చేసినా మళ్లీ భారీ బడ్జెట్ మూవీనే ఉంటుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ తో సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా ఉంటారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news