Gossipsరాజమౌళిని కాదని సినిమా చేస్తున్నాడు.. ఫలితం ఎలా ఉంటుందో..!

రాజమౌళిని కాదని సినిమా చేస్తున్నాడు.. ఫలితం ఎలా ఉంటుందో..!

రాజమౌళితో సినిమా అంటే సినిమాలో ఎలాంటి టెక్నిషియన్ అయినా గొప్ప క్రేజ్ సంపాదించుకుంటాడు. అయితే రాజమౌళితో వరుసగా సినిమాలు చేస్తూ సినిమాటోగ్రాఫర్ గా ది బెస్ట్ అనిపించుకున్న సెంథిల్ కుమార్ ఇప్పుడు ఆయన్ను కాదని మరో సినిమా చేస్తున్నాడు. నిజానికి రాజమౌళితో టై అప్ కాకముందు సెంథిల్ తీసిన సినిమాలేవి అంతగా సక్సెస్ కాలేదు.

సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ తకిట తకిట, గోల్కొండ హైస్కూల్, రఫ్ సినిమాలను తీశాడు. ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. రాజమౌళితో కాకుండా సెంథిల్ చేసిన ప్రయత్నాలివే. ఇక ఎప్పుడైతే రాజమౌళి టీం లో జాయిన్ అయ్యాడో ఇక అప్పటి నుండి అన్ని హిట్ సినిమాలే. అయితే ఇప్పుడు మరోసారి జక్కన్నని కాదని మరో సినిమా ఓకే చేశాడు సెంథిల్ కుమార్.

తమిళ సూపర్ హిట్ మూవీ కనిథన్ రీమేక్ లో సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. నిఖిల్ హీరోగా వస్తున్న ఈ సినిమాకు టి.ఎన్ సంతోష్ డైరక్షన్ చేస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు సెంథిల్ ఉంటే ఆ గ్రాండియర్ వేరేలా ఉంటుందని అతన్ని తీసుకున్నారు. అయితే సెంథిల్ నాన్ రాజమౌళి సినిమాతో హిట్ అందుకుంటాడా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయ్యింది.

http://www.telugulives.com/telugu/director-ajay-kaundinya-sensational-comments-mla-roja/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news