Newsబెడ్ పై ఫేవరేట్ యాంగిల్ ఏంటని అడిగితే.. ఫ్యూజులు ఎగిరిపోయే...

బెడ్ పై ఫేవరేట్ యాంగిల్ ఏంటని అడిగితే.. ఫ్యూజులు ఎగిరిపోయే ఆన్సర్ ఇచ్చిన బాలయ్య హీరోయిన్..!

సౌత్ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాధికా ఆప్టే బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తుంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తున్న ఈ అమ్మడు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకాడదు. మొన్నామధ్య బికిని లుక్ లో విమర్శలు అందుకోగా.. నా బాడీ నా ఇష్టం చూడకుంటే కళ్లు మూసుకోండని షాక్ ఇచ్చిన రాధికా ఆప్టే ఇప్పుడు నేహా ధూపియా షోలో మరింత రెచ్చిపోయింది.

చిట్ చాట్ లో భాగంగా బెడ్ మీద మీకు ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏంటని అంటే.. ఒంటరిగా నేను ఒక్కదాన్నే పడుకున్నప్పుడు అనేసింది రాధికా ఆప్టే. ఇక్కడ బెడ్ మీద అన్నారు కాని మరెవరితోనని అనలేదుగా అంటూ సర్ ప్రైజ్ ఆన్సర్ ఇచ్చింది. ఇక ఈ షోలో సౌత్ సినిమాలు హీరోల ప్రవర్తన గురించి మరోసారి షాకింగ్ విషయాలను బయట పెట్టింది రాధికా ఆప్టే.

సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ ను చులకనగా చూస్తారని అప్పట్లో రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ప్రస్తుతం ఆమె కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలనే చేస్తూ కెరియర్ కొనసాగిస్తుంది. తన మీద అటెన్షన్ వచ్చేందుకు రాధికా ఆప్టే బోల్డ్ స్టేట్మెంట్స్ ను ఏమాత్రం బెరుకు లేకుండా ఇచ్చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news