Moviesఅక్కడా చుపిస్తానంటోన్న రాశికన్నా !

అక్కడా చుపిస్తానంటోన్న రాశికన్నా !

ఊహలు గుసగుసలాడే‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బొద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందిఈమె నటన అందం చూసిన ఇతర దర్శకులు నిర్మాతలు ఆయా చిత్రాల్లో అవకాశాలు పుష్కలంగా ఇచ్చారు.దాంతో వరుస ఆఫర్లు రావడంతో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్న రాశీ ఖన్నా‘ చెప్పుకోదగిన హిట్ సినిమాలు మాత్రం అందుకోలేకపోయింది.

కొంత కాలం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చిందిపెద్ద హీరోల పక్కన వరుస ఆఫర్లు రావడంతో మంచి ఖుషీగా కనిపిస్తోందిఎన్టీఆర్ సరసన జై లవ కుశ‘ చిత్రం..’టచ్ చేసి చూడు‘ చిత్రం..వరుణ్ తేజ హీరోగా తెరకెక్కబోయే కొత్త సినిమాల్లో అవకాశాలు సంపాదించి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది.

జై లవ కుశ‘ తర్వాత ఆమె స్వీడు పెంచిన ఈ బొద్దు గుమ్మ గోపీచంద్ ఆక్సీజన్‘, రవితేజ టచ్ చేసి చూడు‘, వరుణ్ తేజు తొలిప్రేమ‘ ఒకదాని తర్వాత మరొక సినిమాలు చేస్తూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోందిఇప్పుడు కోలీవుడ్ లోనూ రాశీఖన్నా హవా చూపించాలని తహతహ లాడుతోందిప్రస్తుతం ఆమె జయం రవి జోడీగా ఓ తమిళ సినిమా చేస్తోంది.

థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా ఇదిసినిమాలో రాశిఖన్నా పాత్ర డిఫరెంట్ గా ఉండబోతోందటఈ సినిమా కోలీవుడ్ లో తనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని ఈ అమ్మడు ఆశపడుతోంది చూద్దాం అక్కడ ఈ అందాల రాశి అదృస్టమ్ ఎలా ఉందొ చూడాలి మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news