Newsబావ చనిపోయినా నాగ్ సినిమా విడుదల చెయ్యడానికి కారణం ఇదే !

బావ చనిపోయినా నాగ్ సినిమా విడుదల చెయ్యడానికి కారణం ఇదే !

నాగ్ నిర్ణయం కొందరికి ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. కుటుంబంలో విషాదం జరిగితే.. రిలీజ్ విషయలో అంత పట్టుదలేంటి అనిపించి ఉండొచ్చు. కానీ ‘రారండోయ్..’ రిలీజ్ డేట్ మారిస్తే చాలా తలనొప్పులు తప్పవు. సమ్మర్ అడ్వాంటేజీని బాగా ఉపయోగించుకోవాలంటే ‘రారండోయ్..’ మే 26నే రావాలి. జూన్ మొదలైందంటే వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చేసినట్లే. జనాలు హడావుడిలో ఉంటారు.

పైగా జూన్ తొలి రెండు వారాల్లో చాలా చిన్న సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ‘రారండోయ్..’ వాయిదా పడితే వాటన్నింటికీ ఇబ్బంది ఎదురవుతుంది. ఆ సినిమాల్ని హడావుడిగా వెనక్కి తేవడం కుదరదు. జూన్ 23న ‘దువ్వాడ జగన్నాథం’ రాబోతున్న నేపథ్యంలో తొలి రెండు వారాల్లో చాలా చిన్న సినిమాల్ని క్లియర్ చేసేయాలని చూస్తున్నారు. ‘రారండోయ్..’ జూన్‌కు వెళ్తే వాటన్నింటికీ ఇబ్బందే. అందుకే నాగ్ రిలీజ్ డేట్ మార్చట్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news