Gossipsరంగస్థలం నుండి అందుకే నన్ను వెలేశారు..! ఆవేదనతో పృథ్వి

రంగస్థలం నుండి అందుకే నన్ను వెలేశారు..! ఆవేదనతో పృథ్వి

ఓ పక్క రంగస్థలం బాక్సాఫీస్ రికార్డులకు మెగా ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటుంటే మరో పక్క థర్టీ ఇయర్స్ పృధ్వి మాత్రం సినిమాపై తన అసంతృప్తి భావాన్ని వ్యక్తం చేశాడు. రంగస్థలం సినిమాకు థార్టీ ఇయర్ పృధ్వికి సంబంధం ఏంటి అని మీరనుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే సినిమా లెంగ్త్ బాగా ఎక్కువైందని రంగస్థలంలో అతని ట్రాక్ మొత్తం లేపేశారట.

దీనితో హర్ట్ అయ్యాడు పృధ్వి. రంగస్థలం సినిమా హిట్ అయినందుకు సంతోషంగా ఉన్నా తన ట్రాక్ మొత్తం దర్శకుడు ఎడిట్ చేయడంలో కాస్త నిరుత్సాహపడుతున్నాడట. అయితే ఇప్పటికే 179 నిమిషాల లెంగ్త్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ సీన్స్ యాడ్ చేయడం కుదరదు అందుకే సినిమా ఫుల్ వర్షన్ అమేజాన్ ప్రైం లో పెట్టేస్తున్నారట.

సో థర్టీ ఇయర్స్ పృధ్వి రంగస్థలం సీన్స్ అమేజాన్ ప్రైం లో చూడొచ్చన్నమాట. మొత్తానికి సినిమా హిట్ అయినా మరికొన్ని సీన్స్ కలిపి రిపీటెడ్ ఆడియెన్స్ తెచ్చుకునేందుకు కూడా రన్ టైం పెద్ద సమస్యగా మారిందన్నమాట. సుకుమార్ ఇక నుండైనా రన్ టైం విషయం లో జాగ్రత్త పడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news