Gossipsత్రివిక్రంను అతను ఏమని పిలుస్తాడో తెలుసా..!

త్రివిక్రంను అతను ఏమని పిలుస్తాడో తెలుసా..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ ను ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఏమని పిలుస్తాడో తెలుసా.. డాడీ అనట. అవునా అదేంటి అంటే.. త్రివిక్రం అంటే ఇష్టం అన్న పీటర్ హెయిన్స్ ఆ ఇష్టం తోనే త్రివిక్రంను డాడీ అని పిలుస్తా అంటున్నాడు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా సినిమాలు చేసే పీటర్ హెయిన్స్ రాజమౌళి ప్రతి సినిమాకు పనిచేసిన అనుభవం ఉంది.

ఇక త్రివిక్రం సినిమాల్లో కూడా పనిచేసిన పీటర్ హెయిన్స్ ఆయనంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు. తన తండ్రి తనకు చదువు నేర్పించకున్నా సరే మార్షల్ ఆర్ట్స్ నేర్పించాడని ఇప్పుడు అదే తన కెరియర్ కు ఉపయోగపడిందని చెబుతున్నాడు పీటర్ హెయిన్స్. సూపర్ స్టార్ మహేష్ మురారి సినిమాతో పీటర్ హెయిన్స్ ఫైట్ మాస్టర్ గా ప్రస్థానం మొదలు పెట్టాడు. నేషనల్ వైడ్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న పీటర్ హెయిన్స్ త్రివిక్రం ను డాడీ అని సంభోదించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

త్రివిక్రం ఎవరినైనా తన బుట్టలో వేసుకుంటాడు. సినిమాలోని మాటలల్లానే జీవితం మీద ఓ మంచి అవగాహన ఉన్న వాడిగా కనిపించే త్రివిక్రం తన తోటి కళాకారులకు సహకారం అందించడం జరుగుతుంది. అందుకే వారు ఇలా తమ ఆత్మాయతను పంచుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news