Gossipsఐదు నిమిషాలకు ఐదు కోట్లా ..?

ఐదు నిమిషాలకు ఐదు కోట్లా ..?

హాలీవుడ్‌ రేంజ్‌లో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న బ్యూటీ ఓ న్యూస్‌తో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు ప్రమోట్‌ అందాల తార ప్రియాంకా చోప్రా కి ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. తన టాలెంట్‌తో బాలీవుడ్ , హాలీవుడ్ అనే తేడా లేకుండా దూసుకుపోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దు గుమ్మా.కేవలం నటన ఒక్కటే కాదు పారితోషకంలోనూ నాది హాలివుడ్ రేంజ్ అంటూ సవాల్ విసురుతోంది.

బాలీవుడ్‌ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ లలో ప్రియాంక చోప్రా ఒకరు. ఈమె ఈ మధ్య వార్తల్లోకి ఎక్కింది ఎందుకంటే … ఓ సినిమాలో చెయ్యడానికి 5 కోట్లు డిమాండ్ చేసిందట. ఇంతకీ పూర్తిగా ఆ సినిమాలో నటించడానికి కాదు. కేవలం ఓ ప్రత్యేక పాటలో నటించడానికే అంత డిమాండ్ చెయ్యడంతో … అందరూ ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నాను.

ఇటీవల ముంబైలో జరిగిన జీ సినీ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్‌కు సంబంధించిన చాలామంది నటీనటులు స్టేజ్‌ మీద డాన్స్ చేసారు. అందులో ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. అయితే ఆ షో చివర్లో ఐదు నిమిషాల పాటకు డాన్స్ చేసినందుకు ప్రియాంక ఐదు కోట్లు డిమాండ్‌ చేసిందట. దీంతో అమ్మో ప్రియాంకా ఇంత కాస్ట్లీనా… హాలీవుడ్ కి వెళ్ళాక రేంజ్ పెరిగినట్టు ఉందే అంటూ బాలీవుడ్ సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news