Gossipsప్రభాస్ తో మహేష్ ఢి కొడతాడా..

ప్రభాస్ తో మహేష్ ఢి కొడతాడా..

ప్రభాస్, మహేష్ బాబు ఒకేసారి బరిలో దిగబోతున్నారా. ప్రభాస్ తో సై అనడానికే పోకిరీ రెడీ అవుతున్నాడా. టాలీవుడ్ లో పరిణామాలు చూస్తుంటే అదే అన్పిస్తోంది. బాహుబలి-2 ఢి కొట్టడానికి సిద్ధమవుతున్నాడు ప్రిన్స్.

     అసలు విషయానికొస్తే.. మురుగుదాస్ డైరక్షన్ లో మహేష్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అది అనుకున్నట్లు పూర్తయితే.. ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తామంటోంది మూవీ యూనిట్. కానీ ఇదే ఏప్రిల్ 28న బాహుబలి-2ను రిలీజ్ చేయడానికి జక్కన ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.
    యాదృచ్చికమైన విషమేమంటే బాహుబలి-1 విషయంలో కూడా ఇలానే జరిగింది.అప్పుడు శ్రీమంతుడు కూడా పోటీకి వచ్చింది. అయితే అప్పుడు మహేష్ రిలీజ్ ను వాయిదా వేసుకున్నాడు. విశేషమంటే అప్పుడు రెండు సినిమాలు బాక్సఫిస్ దగ్గర హిట్ కొట్టాయి. మరి ఇప్పుడు కూడా సీన్ రీపిట్ అయ్యి రెండు మూవీలు హిట్ కొడతాయా అన్న టాక్ కూడా ఉంది.
    మరో విషయం.. ప్రిన్స్ కు ఓ అలవాటు ఉంది. అదేమంటే ఓ హిట్ మూవీ తర్వాత ఓ ఫ్లాప్ ఇవ్వడం. శ్రీమంతుడు హిట్ తర్వాత బ్రహ్మోత్సవం ఫ్లాపయింది. దీంతో ఇప్పుడు వస్తున్న మురుగుదాస్ మూవీ హిట్ కొట్టడం ఖాయమనే ధీమాలో ఉన్నారు ప్రిన్స్ అభిమానులు. ఏదీ ఏమైనా వచ్చే సమ్మర్ లో అటు జక్కన్న ఇటు మహేష్ మూవీలు మాత్రం ఫ్యాన్స్ ను అలరించనున్నాయి.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news