Gossipsఏపీలో బాహుబలి థియేటర్ ఎక్కడో తెలుసా...

ఏపీలో బాహుబలి థియేటర్ ఎక్కడో తెలుసా…

బాహుబ‌లి సినిమాతో హీరో ప్ర‌భాస్ ఒక్క‌సారిగా నేష‌న‌ల్ వైడ్ హీరో అయిపోయాడు. ప్ర‌భాస్ ఇప్పుడు సాహో సినిమాలో న‌టిస్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో న‌టించ‌డంతో పాటు మ‌రోవైపు బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ త‌న మిత్రుల‌తో క‌లిసి ఏర్పాటు చేసిన యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో సినిమాలు నిర్మించ‌డంతో పాటు సినిమాలు పంపిణీ చేయ‌డం, కొత్త థియేట‌ర్లు, మ‌ల్టీఫ్లెక్స్‌లు నిర్మించ‌డంతో పాటు థియేట‌ర్ల లీజు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వ్యాపారాలు చేస్తున్నాడు.

ఈ క్ర‌మంలోనే ప్రభాస్ ఏపీలో ఓ చోట నిర్మిస్తోన్న థియేట‌ర్ కూడా ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. ఏపీలోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట‌లో ప్రభాస్ అండ్ యూవీ క్రియేషన్స్ పార్టనర్స్ అంతా కలిసి నిర్మిస్తోన్న భారీ థియేట‌ర్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ భారీ మల్టీ ఫ్లెక్స్ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఒకే చోట పలు థియేటర్లు, గేమ్ ఏరియా, రిఫ్రెష్ మెంట్ ఇలా అన్నీ వుండేలా ప్లాన్ చేసారు. అయితే ఇది కాదు విశేషం.

ఈ మ‌ల్టీఫ్లెక్స్‌లో ఓ స్క్రీన్ ఏకంగా 106 అడుగులు ఉంద‌ట‌. దీనికి త్రీడీ స్క్రీనింగ్ ఫెసిలిటీ వుంటుందట. దేశంలోనే ఇలాంటి థియేటర్ నిర్మించడం ఇదే ప్రథమం అని చెపుతున్నారు. మొత్తానికి బాహుబ‌లి లాంటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ప్ర‌భాస్ ఇప్పుడు తాను నిర్మించే థియేట‌ర్‌ను కూడా బాహుబ‌లి రేంజ్‌లోనే నిర్మిస్తున్నాడ‌ని నెల్లూరు జిల్లా జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు. ఈ థియేట‌ర్ నిర్మాణంలో యూవీ క్రియేష‌న్స్‌, ప్ర‌భాస్‌తో పాటు మ‌రికొంద‌రు పార్ట్‌న‌ర్లు ఉన్నా ఇది ఆ ఏరియాలో ఇప్ప‌ట‌కీ ప్ర‌భాస్ థియేట‌ర్‌గా ప్రాచుర్యంలోకి వ‌చ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news