Videos అభిమానులని విపరీతంగా అలరిస్తున్న పవన్ కళ్యాణ్ రేర్ వీడియో.....

అభిమానులని విపరీతంగా అలరిస్తున్న పవన్ కళ్యాణ్ రేర్ వీడియో.. బండ్ల గణేష్ కాళ్ళు పడుతుండగా …

Powerstar pawan kalyan rare video is trending online now. Katamarayudu 30 seconds teaser released recently and breaks most of the youtube records of Indian Cinema.

పవన్ కళ్యాణ్ ఏమి చేసినా న్యూసే.. తిరుమలకి అప్పుడెప్పుడో మెట్లు ఎక్కుతున్న వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అంటే మాములు విషయం కాదు. అవును మరి పవన్ కళ్యాణా మజాకానా! ఒక వైపు కాటమరాయుడు టీజర్ అన్ని రికార్డులని బద్దలు కొడుతుండగా మరో వైపు ఈ రేర్ వీడియో కూడా అందరిని అలరిస్తుండటం గమనార్హం.ఈ వీడియోలో పవన్ ఒక చోట మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ అలసి కూర్చుని తన కాళ్ళని వత్తుకొంటుంటే పక్కనే ఉన్న పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ పవన్ కాళ్ళు పట్టడం విశేషం. ఫాన్స్ కి ఆటోగ్రాఫ్లిస్తూ.. ఫోటోలు దిగుతూ.. మెట్లు ఎక్కుతున్న అలసటని ఏమాత్రం తన దరికి చేరనివ్వకుండా పవన్ కళ్యాణ్ చిరు నవ్వుతోనే అందరినీ పలకరించడం విశేషం.. అందుకే జనానికి పవన్ అంటే పిచ్చి.

ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీ కి స్పెషల్ ఇన్విటేషన్ మీద స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్.ఇది మన తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణం. దాదాపుగా కాటంరాయుడు షూటింగ్ ఇంకా కొన్ని రోజుల్లోనే ముగింపు దశకి చేరుకుంటుందని సమాచారం. ఒక వైపు సినిమా షూటింగులు మరో వైపు జనసేన పార్టీని విస్తృత పరిచే పనిలో చాలా బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news