Newsపవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు తోట రాముడు...!

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు తోట రాముడు…!

మెగా బ్రదర్ నాగ బాబు పవన్ కళ్యాణ్ కు చాలా క్లోజ్. పవన్ కష్టాల్లో ఉన్నప్పుడు నాగబాబు అలానే నాగ బాబు కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడు పవన్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మెగా బ్రదర్స్ గా ఈ ఇద్దరు అన్న మెగాస్టార్ మీద తమ ప్రేమను చూపిస్తూనే ఉంటారనుకోండి. అయితే పవన్ కళ్యాణ్ కు మరో పేరు పవర్ స్టార్ అనే మనకు తెలుసు.. అది ఫ్యాన్స్ పిలిచుకునే పేరు.. కాని నాగబాబు మాత్రం మరో పేరుతో పిలుస్తాడట. అది కూడా పవన్ మరో ముద్దుపేరని తెలుస్తుంది.

ఇంతకీ పవన్ ను నాగబాబు ఏమని పిలుస్తాడు అంటే తోట రాముడు అని తెలిసింది. అదేంటి అంటే చిన్నప్పటి నుండి పుస్తకాలను ఎక్కువగా చదివే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చి కాస్త డబ్బు సంపాదించాక హైదరాబాద్ శివారులో 8 ఎకరాల్లో ఫాం హౌజ్ ఏర్పరచుకున్నాడు. ఖాళీ సమయంలో పవన్ అక్కడే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. అంతేకాదు అక్కడ సేంద్రియ పద్ధతిలో పండ్లు, కూరగాయలు పండిస్తుంటారు.

తనకు నచ్చిన వారికి సీజనల్ ఫ్రూట్స్ పంపించడం పవన్ కు అలవాటే. అయితే పవన్ ఈ వ్యవహారాలన్ని దగ్గరుండి చూసుకుంటాడు కాబట్టి నాగబాబు పవన్ ను తోట రాముడు అని ముద్దుగా పిలుస్తాడట. అన్న కాబట్టి పవన్ అలా పిలిపించుకునేందుకు ఇబ్బంది పడడని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news