సినిమా ఇండస్ట్రీలో నం.1 దురదృష్టవంతుడు మోహన్‌బాబేః పోసాని

mohan babu posani krishna murali

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరు? సినిమాల్లో ఒక్క చిన్న అవకాశం కోసం ఏళ్ళ తరబడి వెయిట్ చేసి…ఆ ఒక్క అవకాశం కూడా దొరకక జీవితంలోనే ఫెయిల్యూర్‌గా మిగిలిన ఎందరో అభాగ్యులా? లేక ఫాంలో ఉన్నప్పుడు ఎంతో గొప్ప పేరు, కోట్లాది రూపాయలు సంపాదించి కూడా జీవిత చరమాంకంలో నా అన్నవాళ్ళు లేక….బాగోగులు చూసుకునే….కనీసం పలకరించే నాథుడు లేక…దిక్కులేని స్థితిలో బలవంతంగా చనిపోయినవాళ్ళా?

వీళ్ళెవరూ కాదూ ….మోహన్‌బాబు అని అంటున్నాడు పోసాని కృష్టమురళి. అదెలాగా…..కోట్లు సంపాదించాడు….ఎన్నో బిజినెస్‌లు ఉన్నాయి. కొడుకులిద్దరూ కూడా మీడియం రేంజ్ హీరోలుగా సెటిల్ అయ్యారు. అన్నింటికి మించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంటి నుంచి కోడలిని తెచ్చుకున్న మోహన్‌బాబు దురదృష్టవంతుడు ఎలా అవుతాడు? అవుతాడనేదే పోసాని బాష్యం. అదెలా అంటే ఆన్సర్ వెరీ సింపుల్. సినిమా ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినా కూడా ఆయా హీరోలకు, వాళ్ళ బాబులకు బీభత్సమైన భజన చేయాల్సిందే. అది ఆనవాయితీ. ఆ భజనలో ఒక్కొక్కళ్ళది ఒక్కొ స్టైల్. ముక్కుసూటిగా మాట్లాడతానని చెప్పుకునే పోసానిది ఇంకో స్టైల్. ఆయన స్టైల్‌లోనే ఈ వ్యాఖ్యలు కూడా చేశాడు. మోహన్‌బాబు సంపాదించుకున్న పేరు, ప్రాపర్టీ అంతా కూడా ఆయన కష్టార్జితం అట. అందులో అదృష్టం ఒక్క శాతం కూడా లేదని పోసాని చెప్పాడు. పోసాని పొగడ్తలు బాగానే వర్కవుట్ అయ్యాయని వింటున్న మోహన్‌బాబు ఆనందాన్ని చూస్తే అందరికీ అర్థమైంది. సో….ఆల్ హ్యాపీస్ అన్నమాట. ఇక త్వరలో రిలీజ్ అవనున్న లక్కున్నోడు సినిమా లక్ ఎలా ఉందో చూడాలి మరి.

More from my site