Gossipsఆమె అందాలకు సరిపడా.. "అంత" సమర్పించుకుంటున్నారట..!

ఆమె అందాలకు సరిపడా.. “అంత” సమర్పించుకుంటున్నారట..!

టాలీవుడ్ లో ఓ సినిమాతో హిట్ అందుకుంటే చాలు ఆమెను నెత్తిన పెట్టేసుకుంటారు. ఇప్పుడు డిజే భామ పరిస్థితి ఇలానే ఉంది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో అలరించినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేని అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాధం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు ఆ సినిమాలో అమ్మడి బికిని సోయగాలకు అందరు ఫిదా అయ్యారు.

ప్రస్తుతం సాక్ష్యం సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తున్న ఈ అమ్మడు సుకుమార్, చరణ్ కాంబోలో వస్తున్న రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందట. ఈ సాంగ్ లో పూజా హాట్ అప్పియరెన్స్ ఉంటుందట. అందుకే ఆమెకు 50 లక్షల దాకా ముట్టచెబుతున్నారట. ఆమె అందాలకు సరిపడా అరకోటి అంటే తక్కువే అని చెప్పొచ్చు.

తెలుగులో రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ లో మొహేంజోదారో సినిమా చేసిన పూజా అక్కడ క్లిక్ అవలేదు. అందుకే మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది. తెలుగులో ఇప్పటికే మరో రెండు స్టార్ సినిమాల అవకాశాలను అందుకుందట. మరి అమ్మడు ఫాం చూస్తుంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దుమ్ముదులిపేసేలా ఉందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news