Gossipsబ్రేకింగ్ న్యూస్ : ఎన్టీఆర్ డైరెక్టర్ పై కేస్ ఫైల్

బ్రేకింగ్ న్యూస్ : ఎన్టీఆర్ డైరెక్టర్ పై కేస్ ఫైల్

ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 33 వద్ద డైరక్టర్ బాబి కారు వేగంగా వచ్చి ఓ మరో కారుని గుద్దడం జరిగింది. అమీర్ పేటకు చెందిన హర్మీందర్ సింగ్ అనే వ్యక్తి కారుని బాబి గుద్దేశాడు. అతని కారు వెనుక భాగం బాగా డ్యామేజ్ అయ్యింది. హర్మిందర్ సింగ్ తో పాటుగా అందులో అతని మదర్ కూడా ఉన్నారని తెలుస్తుంది.

అయితే దీనిపై మాట్లాడేందుకు ప్రయత్నించిన తనని బాబితో పాటు ఉన్న మిగతా ముగ్గురు బెదిరించారట. ఆ సమయంలో బాబి మద్యం సేవించి ఉన్నాడని హర్మిందర్ సింగ్ చెబుతున్నాడు. తానో పెద్ద దర్శకుడని తనకి పెద్దవాళ్లతో పరిచయం ఉందని తన ఇళ్లు కూడా పక్కనే అని అక్కడ మాట్లాడుకుందామని చెప్పాడట బాబి. ఇంతలో హర్మిందర్ సింగ్ మదర్ కు గుండె నొప్పి రావడంతో ఆమెను చూస్తుండగా బాబి జారుకున్నాడట.

దీనిపై హర్మిందర్ సింగ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పవర్, గబ్బర్ సింగ్-2, జై లవ కుశ సినిమాలను డైరెక్ట్ చేసిన బాబి ఇలా చేయడం అందరికి షాక్ ఇచ్చింది. మరి దీనిపై దర్శకుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news