Gossips#PK26 కి ఆ డైరెక్టర్ కన్ఫార్మ్డ్... అభిమానులకి టెన్షన్

#PK26 కి ఆ డైరెక్టర్ కన్ఫార్మ్డ్… అభిమానులకి టెన్షన్

 

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇర‌వై ఏళ్లు దాటుతున్నా ఇంత‌వ‌ర‌కూ 25 సినిమాలు కూడా పూర్తిచేయ‌లేదు ప‌వ‌ర్ స్టార్ . జ‌యాప‌జ‌యాల తీరు ఎలా ఉన్నా ఆయ‌న క్రేజ్ కూడా ఎక్క‌డా త‌గ్గ‌లేదు.అయిన‌ప్ప‌టికీ ఆయ‌న సినిమాల ఎంపిక విష‌యంలో కాస్త నెమ్మ‌దిగానే ఉంటున్నాడు.ఓ కొత్త ప్రాజెక్టు చేసే విష‌య‌మై క‌మిట్‌మెంట్ వెంట‌నే ఇవ్వ‌డం లేదు.అలానే వాణిజ్య ప్ర‌క‌ట‌నలులో కూడా ఆయ‌న న‌టించ‌డు .చేనేత వ‌స్త్రాల‌కు మాత్రం బ్రాండ్ అంబా సిడ‌ర్ గా ఉంటున్నాడు. కానీ ఇటీవ‌ల ఆయ‌న‌లో అనూహ్య‌మైన మార్పే వ‌చ్చింది.

అదేంటంటే..

వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంటున్నాడు ప‌వన్ .. అటు రాజ‌కీయాల్లోనూ మ‌రికొద్ది రోజుల్లో క్రియాశీల‌కం కానున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్ర చేపట్టి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకోనున్నాడు. ఇక ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ చేస్తున్న సినిమాని సంక్రాంతికి విడు ద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. అనిరుధ్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తుండ‌గా, ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ న‌టిస్తోంది.త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన తర్వా త వెంటనే కందిరీగ పేమ్ సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేయ‌నున్నాడ‌ని టాక్.డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంద‌ని తెలు స్తోం ది.ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పైనే బిజీ బిజీగా ఉన్నాడ‌ట‌! మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెల్ల‌డి కావాల్సి ఉంది. మ‌రోవైపు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డికి కూడా మంచి క‌థ ఉంటే చెప్ప‌మ‌న్నాడ‌ట‌! వెంట‌నే సందీప్ ఓ లైన్ చెప్పాడ‌ని అది ఆయ‌న‌కు ఎంత‌గానో న‌చ్చింద‌ని, డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని సూచించాడ‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news