Gossips# PK 26 డైరెక్టర్ ఎవరో తెలుసా ? తెలిస్తే...

# PK 26 డైరెక్టర్ ఎవరో తెలుసా ? తెలిస్తే షాకే …

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రం సినిమా చేస్తుండగా ఆ సినిమా తర్వాత ఎవరితో చేస్తాడు అన్న దాని మీద ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అసలైతే సంతోష్ శ్రీనివాస్ తో పవన్ సినిమా ఉంటుందని తెలిసినా ఆ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ బయటకు రావట్లేదు. ఇక లేటెస్ట్ గా అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం అందుకున్న డైరక్టర్ సందీప్ రెడ్డితో పవన్ సినిమా ఉంటుందని అంటున్నారు.

అర్జున్ రెడ్డి సినిమా రిజల్ట్ పై విష్ చేయడానికి ఫోన్ చేసి మంచి కథ ఉంటే చెప్పమని అడిగాడట. ఇక తన దగ్గర ఉన్న ఓ లైన్ చెప్పగా పవన్ బాగుందని డెవలప్ చేయమని అడిగాడట. ఒక్క సినిమాతో హిట్ కొట్టి రెండో సినిమానే పవర్ స్టార్ తో సినిమా రేంజ్ అంటే ఇక డైరక్టర్ సందీప్ కు తిరుగు ఉండదని చెప్పాలి.

ఒకవేళ ఆ సినిమానే కన్ఫాం అయితే ఆ సినిమా రికార్డులు అరాచకమే అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండతోనే 40 కోట్ల దాకా వసూళ్లను రాబట్టిన సందీప్ సినిమా పవర్ స్టార్ తో ఇండస్ట్రీ రికార్డులను సైతం కొల్లగొడతాడని అంటున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news