Gossipsపెళ్లిచూపులు డైరక్టర్ తర్వాత సినిమా ఇదే..!

పెళ్లిచూపులు డైరక్టర్ తర్వాత సినిమా ఇదే..!

చిన్న సినిమాతో పెద్ద విజయం దక్కించుకున్న సినిమాల గురించి ప్రస్తావిస్తే పెళ్లిచూపులు సినిమా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ సంచలన విజయం అందుకున్న ఆ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ వెంటనే చాలా అవకాశాలు వచ్చినా తాను మాత్రం ఆచి తూచి అడుగులేస్తున్నాడు. సినిమా సక్సెస్ అయితే వెంటనే సినిమా చేసే దర్శకులున్న ఈరోజుల్లో సూపర్ హిట్ సినిమా తీసినా సంవత్సరం పాటు ఆగాడు తరుణ్ భాస్కర్.

తెలుస్తున్న సమాచారం ప్రకారం తరుణ్ భాస్కర్ తన తర్వాత సినిమా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో తీస్తున్నాడని తెలుస్తుంది. ఈమధ్యనే కథా చర్చలు కూడా ముగిశాయట. సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటిస్తాడని తెలుస్తుంది. ఈమధ్యనే వెళ్లిపోమాకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ నటనకు తరుణ్ ఇంప్రెస్ అయ్యాడట.

హీరోని బట్టి చూస్తుంటే మళ్లీ తరుణ్ భాస్కర్ మిని బడ్జెట్ మూవీనే చేస్తాడని తెలుస్తుంది. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలకు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. మరి తరుణ్ భాస్కర్ చేస్తున్న ఈ రెండో ప్రయత్నం ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news