Moviesపవర్ స్టార్ త్రివిక్రం మూవీ ఫస్ట్ లుక్ మిస్..!

పవర్ స్టార్ త్రివిక్రం మూవీ ఫస్ట్ లుక్ మిస్..!

కొద్దిరోజులుగా ఆగష్టు 15న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ తో పాటుగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారని హడావిడి చేశారు. కాని ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవ్వలేదు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ రెడీ చేసినా ఈరోజు కన్నా పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ ఆపేశారట.

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమాలో స్టూడెంట్ గా నటిస్తున్న పవన్ మరోసారి తన ఫ్యాన్స్ ను పండుగ చేసుకునేలా చేస్తాడట. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మరి సెప్టెంబర్ 2న ఈ సినిమా నుండి రిలీజ్ కాబోతున్న ఫస్ట్ లుక్ సినిమా మీద అంచనాలను పెంచుతుందో లేదో చూడాలి. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి మొదట్లో కాని రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news