Newsజనసేన అడుగులెటువైపు????

జనసేన అడుగులెటువైపు????

జనసేన కు కర్త,కర్మ,క్రియ సర్వం తానై వ్యవహారిస్తున్నారు పవర్ స్టార్. ఏకవ్యక్తి పార్టీగా ముద్రపడ్ద జనసేన జిల్లాలలో ఏ కార్యక్రమాలు చేపట్టినా వాటికి పాత్రధారి,గాత్రధారి,సూత్రధారి అన్నీ పవన్ కళ్యానే. జనసేనలో రాజకీయాలలో అనుభవం వున్నా, ప్రజలలో పలుకుబడి గల మరో నాయకుడు లేడు రాడు. పార్టీకవసరమైన నాయకులను ప్రజాక్షేత్రం నుండికాకుండా ఉద్యోగస్తుల్లా రాత పరీక్షలు మౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయటం చూస్తుంటే జనసేన అడుగులు ఏటువైపన్నది జనసేన సానుభూతి పరులకు ప్రజలకు అర్ధం కాక అయోమయంలోపడుతున్నారు. పార్టీ ఉపిరిపోసుకుని మూడేళ్ళు అయినా ఆ పార్టీలో అనుభవజ్ఞులకు చోటు దక్కలేదు. పార్టీ వ్యవహారాలు చూడటానికి కూడా ఆ పార్టీలో అనుభవజ్ఞులు లేకపోవటం విశేషం.

ఎన్నికల సమయానికి పార్టీని తన అన్నగారైన మెగాస్టార్ చేతిలో పెడతారని కొందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే మరి కొందరు ఆ సమయంలో వ్యక్తిగతంగా లాభాలను తెచ్చి పెట్టే పార్టీతో పొత్తుల నాటకానికి తెరతీయచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇలా పవన్ మనసులోని రహస్య ఎజండాపై రాజకీయ పార్టీలు, పార్టీల నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాజకీయ పార్టీ నిర్మాణంలో సంస్థాగత సాంప్రదాయాలకు స్వస్తి పలికి నూతన సాంప్రదాయానికి కొత్త వరవడికి తెరతీసారు. ప్రపంచంలోనే ట్విట్టర్ వేదికగా నడుస్తున్న ఏకైక రాజకీయ పార్టీ ఇది. ముఖ్యమంత్రికి అవసర మైనప్పుడు ప్రజల మద్యకు వచ్చి హడావిడి చేసి పత్రికలలోను టీ వి లలోను కనిపించి …. తదనంతరం తన పని {అంటే సినిమాలలో నటించటం} తాను చూసుకునే ఓకే ఒక నాయకుడు పవర్ స్టార్.

ఎంట్రన్స్ టెస్టులు గట్రా నిర్వహించి పార్టీ సభ్యులను ఎంపికచేసిన ఘనత కూడా జనసేన పార్టీకే దక్కింది. ఇప్పటికే విపక్ష పార్టీలు ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ కు ముద్దుపేరుకూడా పేట్టేసాయి. అయితే పవన్ వ్యవహారశైలి ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. నిత్యం ప్రజలతో మమేకం కావల్సిన పార్టీ ముఖ్యనేత పండగలా అప్పుడప్పుడు మాత్రమే ప్రజలలోకి వచ్చి పోతే ప్రజలాదరిస్తారా అని పార్టీ సభ్యులే లోలోపల మదన పడుతున్నారు అక్టోబర్ నుంచి క్రియాశీలక రాజకీయాలలో క్రీయాశీలం కానున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాన్ ఇప్పటికైనా మేల్కొని ప్రజలలోను పార్టీ సానుభూతిపరులలోను నెలకొన్న గందరగోళానికి తెరదించి స్ఫష్టత కూడీన మార్గాన్ని ఏంపిక చేసుకుంటాడని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news