Politicsకాపు రిజర్వేషన్ల పై స్పందించిన పవన్... కుల రాజకీయాలకు వ్యతిరేకం

కాపు రిజర్వేషన్ల పై స్పందించిన పవన్… కుల రాజకీయాలకు వ్యతిరేకం

రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లపై జనసేన అధినేత స్పందించారు.కాపు రిజర్వేషన్లు దశాబ్ధ కాలంగా ఉన్న డిమాండ్‌ అన్నారు. కులాన్ని ఆధారంగా చేసుకొనే కుల రాజకీయాలకు తాను వ్యతిరేకం అన్నారు. 2014 ఎన్నికల మ్యానిఫిస్టోలో చేర్చినప్పుడు అభ్యంతరం చెప్పని నాయకులు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దశాబ్దకాలంగా జరుగుతున్న ఉద్యమం కాంగ్రెస్‌ హయాంలో ఎందుకు నీరుగారిపోయిందని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ శాంతి యుతంగా పోరాడతానంటే ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్నారు. తనకు కులం ఆపాదించవద్దని పరోక్షంగా ప్రకటించారు.

కాపులను బీసీలో చేర్చే సమయంలో బీసీకులాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పడు సున్నితంగా పరిస్కరించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. బీసీ సంఘాలతో చర్చలు జరపాలని, ప్రస్తుతం జరగుతున్న కమీటీకి సహకరించాలని కోరారు. కాపు రిజర్వేషన్లపై పవన్‌ దాటివేత ధోరణి అవలంభించారు. పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ సాధ్యం కాదని పవన్‌ కళ్యాణ్ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకెళ్లలేదన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news