Gossipsఅన్నయ్యకు అలా విషెష్ అందించిన పవర్ స్టార్..!

అన్నయ్యకు అలా విషెష్ అందించిన పవర్ స్టార్..!

మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి 151వ సినిమా టైటిల్ లోగో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ అటెండ్ కాలేదు. అయితే పవర్ స్టార్ ను ఈ ఈవెంట్ కు పిలిచినా రాలేదని తెలుస్తుంది. పోస్టర్ రిలీజ్ కు రాలేదు కాని అన్నయ్యకు ఉదయాన్నే విషెష్ అందించేందుకు మాత్రం వెళ్లాడని అంటున్నారు.

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పవన్ కళ్యాణ్ ఉదయాన్నే చిరు ఇంటికి వెళ్లారట. ఎప్పటిలానే ఇద్దరు కలిసి కొద్దిసేపు అన్ని విషయాల చర్చించుకున్నారని అంటున్నారు. సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ చిరు పవన్ కు ముందే చూపించాడట. ఇక 2019 ఎన్నికల్లో జనసేన కార్యచరణల గురించి కూడా మెగాస్టార్ చిరంజీవి తో పవన్ ముచ్చటించినట్టు తెలుస్తుంది. మొత్తానికి అన్నయ్యకు విష్ చేయడంలో అందరి కన్నా ముందున్న పవన్ కళ్యాణ్ అన్నయ్య మీద అభిమానాన్ని మరోసారి అలా తెలియచేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news