Gossipsపవన్-త్రివిక్రమ్ మూవీ స్టోరీ ఇదే.. ఓ ఫ్యామిలీ రివేంజ్ డ్రామా.. మాంచి...

పవన్-త్రివిక్రమ్ మూవీ స్టోరీ ఇదే.. ఓ ఫ్యామిలీ రివేంజ్ డ్రామా.. మాంచి థ్రిల్లింగ్ స్టోరీ

ఒకసారి హిట్ కొట్టిన కాంబినేషన్ మరోసారి జతకడితే.. సహజంగానే ఆ ప్రాజెక్ట్‌పై ఎనలేని అంచనాలు నెలకొంటాయి. అలాంటిది.. రెండు బ్లాక్‌బస్టర్స్ సాధించిన త్రివిక్రమ్-పవన్ కాంబో మూడోసారి కలుస్తున్నారంటే దానిపై ఏ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ వుంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ రెగ్యులర్‌గా తెలుసుకోవడం కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఇలాంటి టైంలో కొన్ని వెబ్‌సైట్స్ ఊరికే వుంటాయా? ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకునే మంచి ఛాన్స్ దొరికిందంటూ.. ఆ సినిమా గురించి రకరకాల ప్రచారాలు మొదలుపెట్టేస్తారు. ఆల్రెడీ ఈ సినిమాకి ఫలానా టైటిల్ పెడుతున్నారంటూ ఏవేవో పేర్లు ప్రచారం చేశాయి. ఇప్పుడు ఏకంగా స్టోరీనే లీకైందంటూ ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఆ స్టోరీలైన్ ప్రకారం.. ఈ సినిమా ఓ రివేంజ్ స్టోరీగా వుండనున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి మరణానికి కారణమైన వారు ఎవరు? ఎందుకు ఛంపారు? అనే వివరాలు తెలుసుకుని, చివరికి వాళ్లని చంపేసి తన పగ తీర్చుకోవడమే ఈ సినిమా కథ అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. తండ్రికి ఇద్దరు భార్యలు కాగా, పవన్ రెండో భార్య కొడుకేనని పుకారు. కొన్ని కుటుంబ కలహాల కారణంగా పవన్ తన తండ్రికి దూరంగా వుంటాడని, కానీ కొందరు దుండగులు తండ్రిని చంపేశారని తెలిసి వారి మీద పగ తీర్చుకోవడానికి ఎత్తుగడలు వేస్తాడనేదే ఈ మూవీ కథ అని కొన్ని వెబ్‌సైట్లు వార్తల్ని ప్రచురించాయి. అంతేకాదండోయ్.. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియెన్స్ కోరుకునే అన్నీ అంశాలు పుష్కలంగా వుంటాయని, ‘అత్తారింటికి దారేది’ తరహాలోనే మాటల మాంత్రికుడు తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా తెరకెక్కిస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

ఇదిలావుండగా.. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని ఆగస్టు చివరికల్లా విడుదల చేయాలని యూనిట్ ప్లాన్. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు ఘనవిజయాలు సాధించడంతో.. మూడో చిత్రం కూడా భారీ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news