Gossipsపవన్ కళ్యాణ్ సెంచరీ సినిమా.. ఒక్క తెలుగులోనే చూపించనున్న పవర్ !!

పవన్ కళ్యాణ్ సెంచరీ సినిమా.. ఒక్క తెలుగులోనే చూపించనున్న పవర్ !!

ప్రస్తుం షూటింగ్ చివరిదశకు చేరుకున్న మహేష్ బాబు మూవీ ‘స్పై’డర్ ను 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాహుబలి ప్రభాస్ నెక్ట్స్ మూవీ ‘సాహో’కు 150 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇందులో ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే 30 కోట్లు కేటాయిస్తారని అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కోసం కూడా 100 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని హారిక అండ్ హాసినీ బ్యానర్ పై రూపొందిస్తున్నారు.

పవర్ స్టార్ తో మూవీని ప్రతిష్టాత్మంగా తీసుకున్న నిర్మాతలు.. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ముందుగా అనుకున్న మొత్తం కంటే ఇప్పుడు ఓ 20 శాతం ఫిగర్ పెంచేశా. బాహుబలి కోసం 450 కోట్ల బడ్జెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవన్నీ మల్టీలింగ్యువల్ ఫిలిమ్స్ కాగా.. పవర్ స్టార్ మూవీ ఒక్క తెలుగులోనే వచ్చినా.. ఇంతేసి వసూలు చేయడం పెద్ద విషయమేమీ కాదన్న మాట వాస్తవమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news