Newsపవన్, రవితేజ సిగ్గులేని కామెంట్స్..!

పవన్, రవితేజ సిగ్గులేని కామెంట్స్..!

మాస్ మహరాజ్ రవితేజ నటించిన నేల టికెట్టు సినిమా ఆడియో రిలీజ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఏజ్ పరంగా చూస్తే ఇద్దరు ఒకే గ్రూప్ అయినా రవితేజ, పవన్ స్టైలిష్ గా కనిపిస్తారు. పవన్ సినిమాల్లోకి రాకముందే రవితేజ నటుడు అప్పట్లో తాను పవన్ అని గుర్తించలేదని ప్రస్థావించాడు పవన్ కళ్యాణ్. ఇక రవితేజ అయితే ఎంతమంది జనం ఉన్నా సరే సిగ్గు లేకుండా నటించేస్తారని అన్నాడు.

తాను చేసే కామెడీ వెనుక ఓ ఆవేదన, ఓ బాధ ఉంటుందని అన్నారు. అన్నయ్య తర్వాత తాను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి రవితేజ అని అన్నాడు పవన్ కళ్యాణ్. రవితేజ నటించిన ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ఆశించారు. ఇక సినిమా నిర్మాత రామ్ తాళ్లూరి తనకు ఎప్పటి నుండో తెలుసని.. ఆయన ఓ ఎన్నారై అయినా తాను సంపాదించిన దానిలో ఎంతోకొంత సమాజ సేవకి ఉపయోగిస్తారని అన్నారు పవన్.

ఇక రవితేజ కూడా పవన్ గురించి మాట్లాడుతూ తనకొచ్చిన బెస్ట్ కామెంట్స్ లో పవన్ సిగ్గులేని కామెంట్ ఒకటని అన్నారు. పదేల్ల క్రితం ఎవరో ఫోన్ లో మాట్లాడుతుంటే ఆ ఫోన్ అందుకుని మీరు అలా సిగ్గులేకుండా ఎలా నటిస్తారని పవన్ అడిగారని. అది తన కెరియర్ లో వన్ ఆఫ్ మై బెస్ట్ కామెంట్ అని అన్నారు. రవితేజ లా సిగ్గు లేకుండా అందరిలో నటించాలంటే మాత్రం తాను పారిపోతానని పవన్ అనడం విశేషం. మొత్తానికి పవన్ గురించి రవితేజ, రవితేజ గురించి పవన్ కామెంట్స్ కన్నా సిగ్గు గురించి మాట్లాడి అందరు షాక్ అయ్యేలా చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news