Specialsపవన్ తిక్కకి ఓ లెక్కుంది..!!

పవన్ తిక్కకి ఓ లెక్కుంది..!!

అవును.. పవన్ కళ్యాణ్ చేసే పనులు తిక్కతిక్కగా ఉన్నా..దానికి ఓ లెక్కుంది. మొన్నటికి మొన్న తిరుపతిలో పవన్ ప్రసంగం, సభ తీరు చూస్తే చాలా విషయాలు బోధపడతాయి. అప్పటికప్పుడు నిర్ణయించి తిరుపతిలో సభ పెట్టినా.. ఏ లోటూ రాకుండా సక్సెస్ చేయగలిగారంటే దాని వెనుక ఎంతో ప్లానింగ్ ఉండి ఉండాలి. పైకి అప్పటికప్పుడు జరిగిన నిర్ణయంలా అనిపించినా.. దీని వెనుక పెద్ద ప్రణాళికే ఉందంటున్నారు రాజకీయ పండితులు.

తిరుపతి సభ జరిగిన తీరు పరిశీలించినవాళ్లకెవరైనా అదంతా చంద్రబాబు స్క్రిన్ ప్లే అని క్లియర్ గానే అర్థమవుతోంది. ప్రత్యేకహోదా సెంటిమెంట్ గా మారిన ఈ తరుణంలో దానిపై సైలెంట్ గా ఉంటే రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఇబ్బందే. ఇప్పటికే విపక్ష వైసీపీ, కాంగ్రెస్ లో స్పెషల్ స్టేటస్ రేసులో దూసుకుపోతున్నాయి. బాబుగారికేమో ముందుకెళ్తే గొయ్యి.. వెనక్కివెళ్తే నుయ్యిలా పరిస్థితి. మరి జగన్ కు చెక్ పెట్టడం ఎలా. దానికి సమాధానమే పవన్ కళ్యాణ్.

పవన్ తో ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టొచ్చనేది బాబుగారి ప్రణాళిక అంటున్నారు ఎనలిస్టులు. ఒకటి స్టేటస్ పై జగన్ కు క్రెడిట్ దక్కకుండా అడ్డుకోవడం, రెండోది కాపురిజర్వేషన్లపై ముద్రగడ దూకుడుకు బ్రేకులెయ్యడం. ఈ రెండింటిని పవన్ తో సాధించొచ్చు. ఎలాగూ వచ్చే ఎన్నికల్లో పవన్ తిరుపతి నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు కాబట్టి.. తిరుపతిలోనే సభ పెట్టించారు. దీనికి అభిమాని హత్య విషయం కూడా కలిసిరావడంతో హఠాత్తుగా సభ పెట్టేశారు.

అయితే తిరుపతి సభలో స్టేటస్ ఇష్యూకే పరిమితమైన పవన్.. ముందు ముందు కాపురిజర్వేషన్ల విషయాన్ని కూడా చూసుకోవాలి. ఇప్పటికే రిజర్వేషన్లపై ముద్రగడ డెడ్ లైన్ ముగిసింది. దీనిపై మరో ఉద్యమానికి కోస్తా జిల్లాలు సిద్ధమవుతున్నాయి. దీంతో పవన్ తో ఈ ఇష్యూను డైవర్ట్ చేయించేపనిలో పడ్డారు తెలుగు తమ్ముళ్లు. అందుకే జిల్లాల టూర్ కు స్కెచ్ వేశారు. మొదటిసభ కాకినాడలో పెట్టడం వెనుక ఉద్ధేశ్యం కూడా ఇదే. అక్కడ కొత్త రాజధాని విషయంపై మాట్లాడి కాపు ఇష్యూను డైవర్ట్ చేయొచ్చు.

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి పవన్ రంగంలోకి దిగడం ఖాయం. 2009లో చిరంజీవి ఇలానే చేశారు. బాబుగారి స్కెచ్ ప్రకారం పవన్ కాకినాడతో పాటు.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిగే పట్టణాల్లో కూడా సభలు పెట్టొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news