Reviewsపవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా రివ్యూ, రేటింగ్ మరియు ప్లస్ లు...

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా రివ్యూ, రేటింగ్ మరియు ప్లస్ లు మైనస్ లు

పవన్ కళ్యాణ్ సినిమా వస్తోంది అంటే చాలు జనాలలో క్రేజ్ నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఆడియో ఫంక్షన్ దగ్గర నుంచీ సినిమా థియేటర్ ల వరకూ సినిమాని మోస్తారు అతని అభిమానులు. గత చిత్రం సర్దార్ డిజాస్టర్ అవడం తో ఈ సినిమా కోసం పవన్ ఫాన్స్ ఎదురు చూసారు.మొత్తం మీద వీరం రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దామా ?

కథ – పాజిటివ్ లు

రాయలసీమ ప్రాంతంలోని ఒక ఊరికి కాటమరాయుడు పెద్దగా ఉంటాడు. ఆ మాటకి వస్తే సీమ లోని చాలా ప్రాంతాల వారు రాయుడి మాట వింటూ ఉంటారు. కాంట్రాక్ట్ ల దగ్గర నుంచీ ఇతరత్రా ఏ విషయం లో అయినా రాయుడి మాటే ఫైనల్. అలాంటి రాయుడు కి నలుగురు తమ్ముళ్ళు, తమ్ముళ్ళు అంటే ప్రాణం గా చూసుకునే రాయుడుకి అమ్మాయిలు అంటే అసహ్యం. చిన్నప్పుడు తనని ఇష్టపడిన అమ్మాయి అతన్ని వదిలేయడం తో రాయుడు ఆ తరవాత నుంచీ అమ్మాయిల మీద పంతం పెంచుకుంటాడు. ఒక పక్క గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న తమ్ముళ్ళు అన్నయ్య పెళ్లి చేస్తే కానీ తమ పెళ్లి అవదు అని అర్ధం చేసుకుని అన్నయ్య మీదకి శృతి హాసన్ ని వదులుతారు. శృతి పవన్ ప్రేమలో పడిందా, అమ్మాయిలు అంటే అసహ్యం ఉన్న పవన్ మనసు కరిగిందా అనేది తెరమీద చూడాలి. పవన్ ఈ సినిమాకి వన్ మ్యాన్ షో తో మంచిగా క్యారీ చేసాడు.స్టైలింగ్ అంతా రాయలసీమ స్టైల్ లో పెట్టి .. భాష కూడా అక్కడి భాషనే మాట్లాడాడు కళ్యాణ్. దీనికి కామెడీ తోడు అవ్వడం ,శృతి తో ప్రేమ సన్నివేశాలూ ఇవన్నీ బాగా కుదిరాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. ఫైట్ లు అతిపెద్ద హై లైట్. ఎలేవేషన్ సీన్ లలో పవన్ ఫాన్స్ కి పండగే పండగ.

నెగెటివ్ లు :

ఈ సినిమాకి ప్రధాన నెగెటివ్ లుగా కథ గురించి చెప్పుకోవాలి. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ కి ఈ అన్నదమ్ములని అంటించారు అంతే. కథలో ఒక ట్విస్ట్ కానీ ఆసక్తి రేపే అంశం కానీ లేదు. స్క్రీన్ మీద పాటలు పెద్దగా వర్క్ అవ్వలేదు. డైరెక్టర్ కొన్ని లాజిక్ లు విపరీతంగా మిస్ అయ్యాడు అనిపిస్తుంది. ఇంకాస్త కేర్ తీసుకుని క్లైమాక్స్ ని కాన్సెప్ట్ ఫైట్ పెట్టి ఉంటె అదిరిపోయేది. కామెడీ బాగుంది కానీ అక్కడక్కడా విసుగు తెప్పిస్తుంది. హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ అక్కడక్కడా మిస్ అయ్యింది. కథలో డైరెక్టర్ కి సీరియస్ ఇన్వాల్వ్మెంట్ లేదు. కాటంరాయుడు ఎందుకు ఆ ఊరుకి అంత తోపు అనేది కారణం చూపించలేదు. విలన్స్ తేలిక అయిపోయారు.
Click Here for Katamarayudu Telugu Movie Review and Rating
మొత్తంగా .. సాగతీత సన్నివేశాలు కొన్ని చోట్ల ఉన్నా కూడా డైరెక్టర్ డాలీ స్క్రీన్ ప్లే ని కాస్తంత ఫాస్ట్ గా నడిపిస్తూ వీరం లోని తలనొప్పి సీన్ లని కట్ చెయ్యడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. రొటీన్ సినిమాలు చూడడం అస్సలు ఇష్టపడని వారు ఈ చిత్రాన్ని పూర్తి గా అవాయిడ్ చెయ్యచ్చు. కళ్యాణ్ మార్క్ కామెడీ , ఫైట్ లూ , నిండుతనం కోసం ఈ సినిమా ఫామిలీ తో ఈ వారాంతం లో హ్యాపీగా చూసేయచ్చు. పవన్ నుంచి గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన అత్యంత రొటీన్ సినిమా ఇది. కానీ ఆ సినిమా రేంజ్ లో మాత్రం హిట్ అవకపోవచ్చు. మంచి రెవెన్యూ చేస్తూ కళ్యాణ్ క్యాప్ లో ఒక ఫీదర్ అవుతుంది

రేటింగ్: 3.0 / 5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news