Movies టీజర్ టాక్ : ‘ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం’

టీజర్ టాక్ : ‘ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నదే ముఖ్యం’

Finally, Pawan Kalyan’s latest movie Katamarayudu teaser released. Take a look how it is.

అదిగో, ఇదిగో అంటూ వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ టీజర్ ఎట్టకేలకు ఈరోజు (04-02-2017) సాయంత్రం 4 గంటలకు విడుదల అయ్యింది. పదండి.. ఇదెలాగుందో చూద్దాం.

కత్తులు చేత పట్టుకుని పరుగు లంకిస్తున్న రౌడీల షాట్‌తో స్టార్ట్ అయ్యే ఈ టీజర్ ఊర మాస్‌గా ఉంది. పవన్ కుర్చీలో కూర్చున్నప్పుడు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి అయితే రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. అతని గెటప్ కూడా చాలా బాగుంది. అలాగే.. సినిమాలోని తన తమ్ముళ్లతో కలిసి పవన్ వేసే స్టెప్పులు చూస్తే ప్రతిఒక్కరూ ఊపుతో ఊగిపోతారు. దీని తర్వాత వచ్చేవన్నీ యాక్షన్ సీన్లే. అవన్నీ పూనకాలు తెప్పించే రేంజులో ఉన్నాయి. ఇక ‘ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నది ముఖ్యం’ అని పవన్ చెప్పే డైలాగ్ వింటే మన ఒళ్లు జలదరించిపోతుంది. చివర్లో ట్రైన్‌లో విలన్‌ని కొట్టే దెబ్బ.. అబ్బబ్బాబ్బా అనేలా ఉంది.

టెక్నికల్ పరంగా చూస్తే.. దర్శకుడు డాలీ టేకింగ్ బ్రహ్మాండంగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా అదిరింది. అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి ‘ఓహో’ వేసుకోవాల్సిందే. ఓవరాల్‌గా చూసుకుంటే.. ఈ టీజర్‌ అదిరిపోయిందంతే. ఈ దెబ్బకు సినిమాపై అంచనాలు తారాస్థాయికి పెరిగిపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news