Moviesబయటపడ్డ ‘కాటమరాయుడు’ ట్విస్టులు.. జోష్‌లో పవన్ ఫ్యాన్స్

బయటపడ్డ ‘కాటమరాయుడు’ ట్విస్టులు.. జోష్‌లో పవన్ ఫ్యాన్స్

Pawan Kalyan’s latest movie Katamarayudu twists has been leaked online which gives energy to his fans.

ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు ఇంకా సెట్స్ మీద ఉండగానే.. చాలా విషయాలు బయటపడతున్నాయి. కేవలం ఫోటోలు, పాటలు మాత్రమే కాదు.. కథ, అందులోని ట్విస్టులు సైతం లీకై పోతున్నాయి. లీకేజ్ రాయుళ్ల పుణ్యమా అని.. ఇప్పటికే ఎన్నో సినిమాల విషయాలు బయటపడ్డాయి. తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‘కాటమరాయుడు’ సినిమా కూడా వారి బారిన పడింది. దీంతో.. ఈ మూవీ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా లీకవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఎన్నో సీక్రెట్స్ బయటపడ్డాయి. తాజాగా ఈ మూవీ కథ మొత్తం లీకయ్యింది. వాస్తవానికి ఈ సినిమా తమిళంలో అజిత్ కథానాయకుడిగా నటించిన ‘వీరమ్’కి రీమేక్‌గా రూపొందుతోంది. అయితే.. తెలుగులో పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఆ కథే ఇప్పుడు లీకయ్యింది. అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పదండి.. ఆ కథేంటో మనమూ ఓ లుక్కేద్దాం.

తాజాగా వినిపిస్తున్న కథ ప్రకారం.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌ మిడిల్ ఏజ్‌డ్ ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్నాడు. ఈయనకు ఆడవాసన అస్సలు పడదు. వాళ్లకి ఆమడ దూరంలో ఉంటాడు. అందుకే.. వయసు మీద పడుతున్నా, పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటాడు. అయితే.. పవన్ తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడతారు. ఆ విషయాన్ని తమ అన్నయ్యకి చెప్పడానికి భయపడుతుంటారు. అప్పుడు వాళ్లంతా ఓ పథకం రచిస్తారు. తమ ప్రేమ విషయం తెలియజేయడానికి ముందు.. అన్నయ్యని కూడా ప్రేమరుచి చూపించాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే వారు తమ అన్నయ్యని ప్రేమలోకి దింపే అమ్మాయిని వెతుకుతారు. అప్పుడే వారికి శృతిహాసన్ కంటపడుతుంది. తమ్ముళ్లందరూ ఎలాగోలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడేలా చేసి.. ప్రేమించుకునేలా చేస్తారు. ఇక అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో.. అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దాంతో.. పవన్ తమ్ముళ్లు చిక్కుల్లో పడతారు. వాళ్ళని పవన్ ఎలా బయటపడేస్తాడు? తన ప్రేమలో ఎలా గెలుచుకుంటాడు? అన్నదే కథ.

చూస్తుంటే.. ఇందులో లవ్ యాంగిల్‌తోపాటు ఫ్యామిలీ అంశాలు, మాస్ మసాలా ఎలిమెంట్స్ ఓ రేంజులో ఉండేలా కనిపిస్తున్నాయి. పైగా.. రాజకీయ నేపథ్యమున్న చిత్రం కాబట్టి, ఓ మెసేజ్ కూడా ఉండనుందని తెలుస్తోంది. దీంతో.. ఈసారి తమ అభిమాన నటుడు మంచి స్టోరీతో బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. మొత్తానికి.. ‘సర్దార్’తో ఫ్యాన్స్‌ని నిరాశపరిచిన పవన్, ఈసారి ఓ పవర్‌ఫుల్ స్టోరీతో మాంచి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news