Newsఆ అరుదైన గౌరవం దక్కించుకుని.. చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్

ఆ అరుదైన గౌరవం దక్కించుకుని.. చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్

Powerstar Pawan Kalyan has created a sensational record by getting invitation from Harvard University to speak.

టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరిలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమాలపరంగా కంటే వ్యక్తిగతంగానే జనాలు ఆయన్ను ఎక్కువగా ఇష్టపడతారు. ఆపదలో ఉన్నవారిని వెంటనే ఆదుకునే మంచిగుణం, పిలిస్తే అభిమానుల కోసం పరిగెత్తే స్బభావం, నలుగురితో సఖ్యతగా ప్రవర్తించే సభ్యత ఉండడంతో.. ప్రతిఒక్కరూ ఆయనకి ఆకర్షితులవుతున్నారు. బహుశా ఆ గుణాలే.. ఇప్పుడు ఆయనకొక అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరోకి ఈ అవకాశం లభించలేదు. అదేంటో తెలిస్తే.. ఆయన అభిమానులే కాదు, ప్రతి తెలుగువారు సంతోషిస్తారు.

అదేంటంటే.. బోస్టన్‌లోని ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ‘ఇండియా కాన్ఫరెన్స్‌ 2017’ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి నెలలో జరగబోయే ఈ ఈవెంట్‌కి హాజరు కావలసిందిగా నిర్వాహకులు పవన్‌కు ఆహ్వాన పత్రాన్ని పంపారు. ఈ సదస్సులో పాల్గొని.. విద్యార్థులతో తమ అభిప్రాయాన్ని పంచుకోవాల్సిందిగా వారు కోరారు. ఈ ఆహ్వానం పొందిన తొలి తెలుగు హీరోగా పవన్ చరిత్ర సృష్టించారు. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌హాసన్‌కు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇప్పుడు ఆయన తర్వాత ఆ అవకాశం పవన్‌కు రావడం విశేషం. పవన్ ఈ సదస్సుకు హాజరైతే.. ఫిబ్రవరి 11 లేదా 12న ప్రసంగించే అవకాశం ఉంది. పవన్‌తోపాటు ఆయన మిత్రుడు, దర్శకుడైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా ఈ సదస్సులో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమాచారం పవన్ అభిమానుల్లో సంతోషం నింపుతోంది.

ఇదిలావుండగా.. పవన్ ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం కిషోర్‌ కుమార్‌ పార్థసానీ(డాలి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘కాటమరాయుడు’ చిత్రంలో నటిస్తున్నాడు. శ్రుతిహాసన్‌ కథానాయిక నటిస్తున్న ఈ చిత్రం.. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘వీరమ్’కి రీమేక్. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చిత్రంతో సహా టీఆర్‌ నేసన్‌ దర్శకత్వంలో పవన్‌ నటించనున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news