‘తమ్ముడూ lets do కుమ్ముడు’.. కానీ!!

pawan kalyan guest role in ammadu lets do kummudu song

An interesting news going viral in Tollywood about Khaidi No 150 movie on Ammadu let’s do kummudu song. There is a line in the middle of song which was sung by Chiranjeevi is become a hot topic

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 ప్రాజెక్ట్‌కి సంబంధించి రీసెంట్‌గా విడుదలైన ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాట సరికొత్త సందేహానికి తెరలేపింది. ఈ పాట మధ్యలో చిరు స్వయంగా ‘తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు’ అనే లైన్ చెప్పడం, అప్పుడు వచ్చే మ్యూజిక్ బీట్ కూడా కాస్త మారిపోవడంతో.. దాని గురించే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.

గతంలో ‘ఖైదీ నెంబర్ 150’ మెగాహీరోలందరూ కనిపించవచ్చునని ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఓ పాటలో కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపించింది. ఆ వార్త నిజమే అయి ఉంటుందని, అందుకు సంకేతమే చిరు చెప్పిన ‘తమ్ముడూ లెట్స్ డు కుమ్ముడు’ లైన్ అని అనుకుంటున్నారు. అందుకే.. డీఎస్పీ ఆ సమయంలో బీట్ మార్చి ఉంటాడని భావిస్తున్నారు. చిరు చెప్పిన ఆ లైన్ వచ్చిన పవన్, మెగాస్టార్ ఇద్దరూ కాసేపు తమ స్టెప్పులతో ఇరగదీయడం ఖాయమని అంటున్నారు.

అయితే.. ఈ విషయమై యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. నిజానికి.. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ఒకవేళ పవన్ జాయిన్ అయి వుండుంటే.. ఈ విషయం ఎలాగోలా లీకై ఉండేది. కానీ.. ఎలాంటి వార్త రాలేదు. కావాలనే యూనిట్ సీక్రెట్‌గా ఉంచుతుందా? అనేది తెలియడం లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే.. యూనిట్ అయినా స్పష్టం చేయాలి లేదా సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి.

More from my site